రిలీజైన 'బ్రోచేవారెవరురా' మూవీ టీజర్

రిలీజైన 'బ్రోచేవారెవరురా'  మూవీ టీజర్

యంగ్ హీరో శ్రీవిష్ణు మరో హీరో సినిమాలల్లో నటిస్తుంటే సెలక్టివ్ స్టోరీస్‌తో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ హీరో చేసిన సినిమాలు ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వైవిధ్యమైన కథతో బ్రోచేవారెవ‌రురా అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు చిత్రటీమ్. ఆ టీజర్‌పై మీరు ఓ లుక్కెయండి..

యంగ్ హీరో శ్రీ విష్ణు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతర హీరోల సినిమాల్లో ప్రెండ్ పాత్రలో నటిస్తునే , డిఫరెంట్ స్టోరీస్‌తో హీరోగా సినిమాలు చేస్తు సక్సెస్ అందుకుంటున్నాడు. ఆ మధ్య వచ్చిన నీది నాదీ ఒకే క‌థ , మెంటల్ మదిలో సినిమాల్లో తన ఫర్మామెన్స్‌తో ఆడియన్స్ ఫిదా చేశాడు. స్టోరీ బాగుడటంతో ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాదించాయి. ప్రస్తుతం బ్రోచేవారెవ‌రురా అనే చిత్రం చేస్తున్నాడు. మెంట‌ల్ మ‌దిలో లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీ విష్ణుకు జోడీగా నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్..

ఈ టీజర్ వచ్చే ప్రతి సీన్ కూడా ఆడియన్స్‌లో క్యూరియసిటీని క్రియేట్ చేస్తోంది. టీజర్‌లో శ్రీవిష్ణు, ప్రియదర్శి ,రాహుల్ రామకృష్ణ డబ్బుకోసం కిడ్నాపులు చేయడానికి రంగంలోకి దిగిన టీమ్ లా కనిపిస్తున్నారు. భరతనాట్యకారిణి పాత్రలో నివేదా కనిపిస్తోంది. ఈ మూవీ ఐదు పాత్రల చూట్టు తిరుగుతుందని తెలుస్తోంది. కంప్లీట్‌గా కామెడి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుందని టీజర్‌ని చూస్తే అర్ధం అవుతుంది..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఈ మూవీతో శ్రీ విష్ణు హీరోగా మ‌రో హిట్‌ని తన ఖాతలో వేసుకోవడం ఖాయమనిపిస్తోంది.. మరి ఈ సినిమా శ్రీ విష్ణుకు ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *