బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మ‌ృతి

హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో విషాదం చోటుచేసుకుంది. బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు పీఎస్‌లో భర్త ఫిర్యాదు చేశారు.

స్కూల్‌ బస్సు ఢీకొని చిన్నారి మృతి

నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మనోఙ్ఞ అనే చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కర్ణాటకలో కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం...

దేశమంతా ఎంతో ఉ‍త్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ముగింపు పడింది. విశ్వాస పరీక్షలో పరాజయం పాలై కుమారుస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు కుప్పకూలింది.మంగళవారం (జులై 23) సాయంత్రం డివిజన్ పద్ధతిలో స్పీకర్ రమేశ్ కుమార్ ఓటింగ్ నిర్వహించారు.…

1వ తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు...

మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయుడు… విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదాడు. ఒకటో తరగతి చదువుతున్న సాత్విక్ అనే విద్యార్దిపై కోపంతో వీపుపై కొట్టాడు.