ప్రియురాలి ఫోన్ తీసినందుకు జైలుకెళ్లాడు

ప్రియురాలి ఫోన్ తీసినందుకు జైలుకెళ్లాడు

ప్రేమించిన అమ్మాయి ఫోన్ చూసినందుకు ఒక యువకుడు జైలుకెళ్లాడు. ఫోన్ చూసినందుకే జైలుకు పంపిస్తారా అనే అనుమానం వస్తే..పదండి…ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో ఫెయిల్స్‌వర్త్ నగరంలో మీరు గనక ఇలా ప్రియురాలి ఫోన్ అనుమతిలేకుండా తీసుకుని ఆమెను అవమానిస్తే…మీక్కూడా జైలు ఊచలు తప్పవు. ఇంతకూ అసలు కథ తెలీదు కదా…అయితే…హెవెన్స్ చేసిన పొరపాటు గురించి చదవండి..!

అలెగ్జాండర్ హెవెన్స్, స్టెసీ బూత్‌లు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరోజు స్టెసీ నిద్రపోతున్న సమయంలో హెవెన్స్ ఆమె ఫోన్‌ను తీసుకుని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె వేలి ముద్ర ఉంటేనే ఓపెన్ అవుతుందని తెలిసీ…నిద్రలో ఉన్న ఆమె వేలు పట్టుకుని ఫోన్ లాక్ తీశాడు. స్టెసీ మరొక వ్యక్తితో డేటింగ్ చేస్తుందనే అనుమానంతో చాటింగ్ హిస్టరీ, ఫోటోలను చూశాడు. ఆమె నిద్రలోంచి మేలుకొన్న తర్వాత హెవెన్స్ ఆమెను నిలదీశాడు. ఆమె ఫోన్‌లోని వ్యక్తుల ఫోటోల గురించి ప్రశ్నించాడు. ఆమె మెసేజ్‌లను చూడ్డానికి పాస్‌వర్డ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఇలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవగా మారింది. కోపంతో ఊగిపోయిన హెవెన్స్..స్టెసీ భుజాన్ని కొరికాడు. కోపాన్ని ఆపుకోలేక ఆమె వేలిని వెనక్కి విరిచేశాడు. ఇక స్టెసీ ఆగ్రహంతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసుని విచారించిన మాంచెస్టర్ క్రౌన్ కోర్ట్…సంవత్సరపాటు హెవెన్స్‌కు జైలు శిక్ష ఖరారు చేసింది. యువతిపై పెత్తనం చలాయించడం, ఎక్కువగా మద్యం తీసుకోవడం, కొకైన్ వాడకం లాంటి పలుకేసులు హెవెన్స్‌పై కేసులు నమోదయ్యాయి. ఒకవేళ అతనిలో మార్పు వస్తే శిక్షను ఆరునెలలకు తగ్గిస్తామని వెల్లడించింది. భవిష్యత్తులో ఇంకెపుడూ స్టెసీని కలవకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *