బోయపాటి ఇక మారడా ???

బోయపాటి ఇక మారడా ???

బోయపాటి శ్రీను… ఈ తరం తెలుగు సినిమాలో ఈ దర్శకుడికంటూ ఒక ఫార్మాట్ ఉంది. ఒక స్పెషల్‌ ఫార్ములా ఉంది. చూడగానే అతని సినిమానే అని చెప్పేలా తనదైన సొంతదనం ఉంది. తొలి సినిమా “భద్ర”తోనే తానేంటో ఇండస్ట్రీకి గట్టిగా చెప్పాడు. తెలుగు సినిమాకు మాస్‌ డైరక్టర్‌ వచ్చినట్టు ప్రేక్షకులకు హింట్‌ ఇచ్చేశాడు. అప్పటి నుంచే బోయపాటి మీద తెలుగు ఆడియన్స్‌కు అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలం పాటు ఆ అంచానల లెక్కలను తేల్చుకోవడంలో బోయపాటి గెలిచాడు. నాలుగంటే నాలుగు హైవోల్టేజ్ సీన్లతో, ఓ రెండు ఎమోషనల్ సీన్లతో ఏ ఇబ్బందీ లేకుండా అతి సింపుల్‌గా హిట్లు కొట్టి ఊరమాస్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఫ్లాపులతో సతమతమవుతోన్న బాలయ్య లాంటి స్టార్‌కు హిట్టూ, సూపర్‌ హిట్టూ ఇచ్చాడు. కానీ కొన్నాళ్లుగా సీన్ మారిపోయింది. 

vinaya vidheya rama review

అలా వచ్చాడు…

ఎందరిలానో బోయపాటి కూడా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చాడు. ఇండస్ట్రీలోని అడుగడుగునా నడిచే వచ్చాడు. కష్టాల వంతెన మీద ఆకలిని మోస్తూనే తిరిగాడు. కథ, మాటల సహకారాన్ని అందించాడు. 1997లో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ఎనిమిదేళ్ల పాటు అక్కడే రాటుదేలాడు. తనకి తాను పదును పెట్టుకున్నాడు. 2005 లో రవితేజతో కలిసి “భద్ర” సినిమాతో వచ్చి తానేంటో, తన పదునేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో “తులసి” తీసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను తనవైపు తిప్పుకున్నాడు. యాక్షన్‌ సీన్స్ తీయడంలో తన ప్రత్యేకతను కొంతకొంతగా పరిచయం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత సింహాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ అయ్యాడు. ఎన్నో ఏళ్లగా హిట్ కోసం సతమతమవుతోన్న బాలయ్యకు సూపర్‌ హిట్‌ ఇచ్చి మరింత మందికి చేరువయ్యాడు. ఎంతో మంది నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడి నుంచే బోయపాటి దారి తప్పాడు. దృష్టిని కథ మీద నుంచి ఫైట్ల మీదకూ, హై ఓల్టేజ్‌ సన్నివేషాల మీదకూ మరల్చాడు. భారీ అంచనాల మధ్య తారక్‌తో తీసిన “దమ్ము” అంచనాలను అందుకోలేక పోయింది. ఆ తర్వాత మళ్లీ బాలయ్యతో జతకట్టి లెజండ్‌తో హిట్‌ కొట్టి, తన మీదున్న ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుంచీ ఈ రోజు వరకూ బోయపాటి పూర్తిగా దారి తప్పాడు. 

vinaya vidheya rama review

చివరి మూడు సినిమాలూ… 

లెజండ్‌ తర్వాత… ప్రేక్షకులను అంచనా వేయడంలో బోయపాటి పూర్తిగా విఫలమయ్యాడు. ఫైట్లతో, హై ఓల్టేజ్‌ సీన్లతో సినిమాను లాగించేద్దామనే అపోహలో ఉండిపోయాడు. యాక్షన్‌  సీన్లను చూసి నవ్వుకునే స్థాయిలో వాస్తవానికి దూరంగా నడిచాడు. కమర్షల్‌గా హిట్‌ అయినా సరైనోడు సరైన సక్సెస్‌ కాదనే చెప్పుకోవాలి. సినిమాలో యాక్షన్‌ సీన్లు ఉండే స్థాయి నుంచీ… యాక్షన్‌ సీన్ల కోసం సినిమా తీసే వరకూ బోయపాటి వచ్చేసాడని ఒప్పుకుని తీరాలి. ఈ విషయం ఆ తర్వాత వచ్చిన “జయ జానకీ నాయక” లో స్పష్టంగా అర్ధమైతోంది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించినా ఎన్నో ట్రోల్స్‌నూ, విమర్శలనూ ఎదుర్కొంది. ఇప్పుడు చరణ్‌తో వచ్చిన “వినయ విధేయ రామ” కూడా డివైట్‌ టాక్‌ను తెచ్చుకుంది. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *