బర్త్ డే బంప్స్ వల్ల వ్యక్తి మృతి

బర్త్ డే  బంప్స్ వల్ల వ్యక్తి మృతి

ఈ మధ్య కాలంలో సరికొత్తగా బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నారు. బర్త్ డే చేసుకునే వ్యక్తిని స్నేహితులు ఇష్టమొచ్చినట్లు చాలాసేపు కొడుతారు. ఈ టైప్ బర్త్ డే వేడుకలు ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయాయి. అయితే ఇలాంటి వేడుకే హైద్రాబాద్ లో ఒకరి ప్రాణం తీసింది. హైద్రాబాద్ లోని ఓ హాస్టల్ ఉండే కాలేజీ విద్యార్థులు వారి స్నేహితుడి బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు. బర్త్ డే చేసుకుంటున్న వ్యక్తిని అందరూ కలిసి కొట్టారు. ఆ తర్వాత అతను ఆ దెబ్బలకు తాళలేక హాస్పిటల్ లో చేరి కొన్ని రోజుల తర్వాత ప్రాణాలు వదిలివేశాడు. పుట్టినరోజు వేడుకలు చేసుకున్న వ్యక్తి ఆ వేడుకల వల్ల మరణించడం దారుణం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *