ఈ ఛాలెంజ్ చేసే దమ్ముందా? వైరల్ అవుతున్న వీడియోలు!

ఈ ఛాలెంజ్ చేసే దమ్ముందా? వైరల్ అవుతున్న వీడియోలు!

సోషల్ మీడియాలో ఏదైన వైరల్ అవ్వాలంటే కొన్ని సెకన్ల సమయం చాలు. అప్పట్లో ఐస్ బకెట్ ఛాలెంజ్, తర్వాత కికి ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేపాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఈ ఛాలెంజ్‌లను స్వీకరించి తమదైన స్టైల్‌లో చేసి చూపించారు. తాజాగా మరో కొత్త ఛాలెంజ్ సోషల్ మీడొయా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అదే…బాటిల్ క్యాప్ ఛాలెంజ్. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు దీన్ని స్వీకరించి తమ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

కిందపడకుండా…
ఈ ఛాలెంజ్‌లో….బాటిల్‌ మూతను ముందుగానే కొంచెం వదులు చేసి ఉంచుతారు. ఆ తర్వాత కాలితో తన్ని బాటిల్‌ మూతను తీయాలి.. అదికూడా బాటిల్‌ కిందపడకుండా! ఒక్కరితో మొదలైన ఈ ఛాలెంజ్.. చాలా తక్కువ సమయంలో అందరికీ పాకింది. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఇప్పుడీ ఛాలెంజ్‌ను ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో…సామాన్య ప్రజలు సైతం ఈ ఛాలెంజ్‌ను ప్రయత్నిస్తున్నారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *