అమెరికాలో 'బాంబు' తుఫాను దెబ్బ

అమెరికాలో 'బాంబు' తుఫాను దెబ్బ

అగ్రరాజ్యం అమేరికాను మంచు తుఫాను వణికిస్తోంది. బాంబు తుఫాను దెబ్బకు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి… జనజీవనం స్తంభించిపోతుంది. అసలు అమేరికన్లపై తుఫాను ప్రభాతం ఎందుకంత పగపట్టింది…అసలు బాంబు తుఫాను అంటే ఎంటి.?

అమెరికాను మంచు తుఫాను భయపెడుతుంది. కొలరాడో రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మంచు తుఫాను విజృభనతో భవనాలు కూలిపోయి 17 మంది మృతి చెందారు. గంటకు 148 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో.. కొన్ని లక్షల కుటుంబాలు చీకటిలో నరకయాతన అనుభవిస్తున్నాయి.

Bomb storm in America

అట్లాంటిక్‌ సముద్రంపై ఏర్పడిన మంచు తుఫాన్ పై హెచ్చరికలు జారీ చేసిన వాతవరణశాఖ అధికారులు దీనికి బాంబ్‌ తుఫానుగా నామకరణం చేశారు. బాంబ్‌ తుఫాను అంటే పేలుడు స్వభావం కలిగిన తుఫాను అని అర్థం. 24 గంటల వ్యవధి అల్పపీడనం 24 మిల్లీబార్స్‌ మేర పడిపోతే దాని ఫలితంగా ప్రచండమైన వేగంతో గాలులు వీస్తాయి. ప్రస్తుతం అట్లాంటిక్‌ సముద్రంపై ఏర్పడిన మంచు తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీయడంతోపాటు విపరీతమైన మంచు కురుస్తోంది. ఈ తుఫాను గాలులకు చెట్లను సైతం కూల్చివేసే శక్తి ఉంటుంది. భవనాలు కూడా దెబ్బతినే అవకావం ఉంది. ముఖ్యంగా న్యూయార్క్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతాలపై ఈ తుఫాను ఎక్కువ ప్రభావం కనబర్చే అవకాశం ఉండటంతో ఆ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

బాంబ్‌ తుఫాను ఎఫేక్ట్‌తో న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా, బోస్టన్‌ , మేరీల్యాండ్‌, వర్జీనియాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఐస్‌ బర్గ్‌ల మీద నిలబడవద్దని, అవి కొట్టుకుపోయే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక తుఫాను అతలాకుతలం చేస్తుండటంతో అధికారులు స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. వృద్ధులు, నిరాశ్రయుల కోసం వందలాదిగా వార్మింగ్‌ కేంద్రాలు వెలిశాయి. ఇది వారాంతం వరకు మైనస్‌ 29 డిగ్రీల నుంచి మైనస్‌ 46 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *