అమెరికాను వణికిస్తున్న 'బాంబ్ తుపాను'

అమెరికాను వణికిస్తున్న 'బాంబ్ తుపాను'

Bomb Cyclone in america

అమెరికాను బాంబ్‌ తుపాను వణికిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి వచ్చిన తుపానుతో దక్షిణ డకౌటాలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది, కొలరాడో నుంచి మిన్నెసోటా వైపునకు రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాతావరణ పీడనల్లో ఆకస్మిక తగ్గుదల వల్ల తుపాను వేగంగా బలపడుతుందని అధికారులు తెలిపారు. రెండు అడుగుల మేర మంచు పేరుకుపోవడం సహా తుపాను కారణంగా నెబ్రాస్కా, దక్షిణ డకోటా, విస్కాన్సిస్‌, మిన్నెసోటా వంటి ప్రాంతాలు మంచు ప్రమాదంలో చిక్కుకున్నాయి. కొన్ని బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *