నేపాల్‌లో బాంబు పేలుళ్లు

నేపాల్‌లో బాంబు పేలుళ్లు

నేపాల్‌లో జరిగిన మూడు వేర్వేరు బాంబు పేలుళ్లలో నలుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాఠ్మాండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఆదివారం ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరం మధ్యలోని ఘట్టెకులో ప్రాంతంలో జనావాసాల్లో జరిగిన పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండో పేలుడు నగర శివారులోని సుకేధరలో ఓ క్షౌర దుకాణంలో జరిగింది. పేలుళ్లకు సమీపంలోని గోడలు సైతం బీటలు వారాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాలను ఆ దేశ ఆర్మీ మోహరించింది. అయితే, ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటించలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *