సినిమాలు లేక ఫ్రీగా ఉన్న బాలీవుడ్ టాప్ స్టార్స్

సినిమాలు లేక ఫ్రీగా ఉన్న బాలీవుడ్ టాప్ స్టార్స్

బాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే టక్కున గుర్తొచ్చే వారిలో బిగ్ బి అమితాబ్,కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తప్పకుండా ఉంటారు.బి-టౌన్ ని దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఏలుతున్న ఈ స్టార్స్ లో అమితాబ్ నటించిన కొత్త సినిమా బద్లా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది.క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో అమితాబ్,తాప్సిల పెర్ఫార్మన్స్ విమర్శకుల ప్రశంశలని దక్కించుకుంది.ఈ విషయాని తెలియజేస్తూ బద్లాకి వచ్చిన రేటింగ్స్ ని రివ్యూస్ ని అమితాబ్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ…”ఇక దీని పని అయిపోయింది,రేపటి నుంచి నేను ఖాళీ ఎవరు ఉద్యోగం ఇస్తారు.గత 40 ఏళ్ళ నుంచి ఈ ప్రశ్న వేస్తూనే ఉన్నాను”అని ఒక ట్వీట్ పోస్ట్ చేశాడు.అంటే బద్లా అయిపోయింది కాబట్టి ఇంకొకరు షూటింగ్ కి పిలిచే దాకా ఖాళీ అని ఒక ట్వీట్ తో బిగ్ బి క్లారిటీ ఇచ్చేశాడు.

Bollywood stars Upcoming film Badla

 

అమితాబ్ అంతటి స్టార్..తాను కాళీ అని ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చాడనుకుంటే,బిగ్ బి కి షారుక్ ఖాన్ కూడా కలిసి అందరికీ భారీ సర్ప్రైస్ ఇచ్చాడు.అమితాబ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన షారుఖ్ “మీకు జాబ్ దొరికాక నన్ను కూడా రికమండ్ చేయండి,నేను కూడా ఖాళీగా ఉన్నాను”అని ట్వీట్ చేశాడు.ఇది వారి మధ్య ఫన్నీగా జరిగిన సంభాషణే అయినా కూడా సినిమాలు లేక ఈ ఇద్దరూ కాలిగా ఉన్నారు అనేది మాత్రం నిజం. ముఖ్యంగా కింగ్ ఖాన్ గా పేరున్న షారుఖ్ ఖాన్ కి గత నాలుగైదేళ్లుగా టైం అసలు బాగోలేదు.ఏ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుండడంతో షారుఖ్ చేతికి కొత్త ప్రాజెక్ట్స్ రావట్లేదు.మరోపక్క అమితాబ్ కి పార్ట్ టైం హీరోగా,ఏజ్ కి తగ్గట్లే స్పెషల్ రోల్స్ మాత్రమే ప్లే చేస్తున్నాడు.సో ఎటు చూసిన ఈ ట్వీట్స్ బాలీవుడ్ లో కొత్త చర్చకి చోటిచ్చింది. ఈ పరిస్థితి నుంచి అమితాబ్ కోలుకోలేకపోయినా కూడా షారుక్ మాత్రం కంబ్యాక్ అవ్వగలడు.మరి ఏ దర్శకుడు కింగ్ ఖాన్ ని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తాడో చూడాలి.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *