రజినీకాంత్ ‘దర్బార్’లో విలన్‌గా బాలీవుడ్ హీరో ఎవరంటే..

రజినీకాంత్ ‘దర్బార్’లో విలన్‌గా బాలీవుడ్ హీరో ఎవరంటే..

sunil shetty in darbar

సునీల్‌ శెట్టి, రజనీకాంత్‌ మధ్య డిష్యూమ్‌ డిష్యూమ్‌ నడువనుంది. ‘దర్బార్‌’ కోసం పోరాటాలు చేయబోతున్నారు. అదేంటీ వీళ్లద్దరికి తగాదాలు ఏమున్నాయని అనుకుంటున్నారా? అదేనండీ…రజనీకాంత్‌ హీరోగా ‘దర్బార్‌’ చిత్రం చేస్తున్నారు కదా. అందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి చేస్తున్నారు. గతంలో రజనీ చేసిన ‘2.0’ చిత్రానికి బాలీవుడ్‌ హీరో అక్షరు చేత ప్రతినాయకుడి పాత్ర చేయించారు. ఇప్పుడు అదే బాలీవుడ్‌ చెందిన మరో హీరో సునీల్‌ శెట్టితో ‘దర్బార్‌’లో చేయిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌ కోసం సునీల్‌ శెట్టి విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయన తార కథానాయిక. గతంలో ‘మెయిన్‌ హూన్‌ నా’ సినిమాలో నెగిటివ్‌ రోల్‌ చేశారు సునీల్‌ శెట్టి. ఇందులో ఓ కార్పొరేట్‌ కంపెనీ వ్యవస్థాపకుడిగా కనిపించబోతున్నారు. రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబాయిలో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో సునీల్‌ శెట్టి చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో తన లుక్‌ కోసం ప్రిపరేషన్‌లో ఉన్నారు ఈ బాలీవుడ్‌ హీరో.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *