అమెజాన్ ఇండియాగారు..మాకేంటిది!? సోనాక్షి సిన్హాకు చేదు అనుభవం

అమెజాన్ ఇండియాగారు..మాకేంటిది!? సోనాక్షి సిన్హాకు చేదు అనుభవం

ఈ కామర్స్ వ్యవహారాలు వచ్చిన తర్వాత అందరికీ బద్దకం ఎక్కువైంది. కొన్నిసార్లు వీలు లేక కూడా అవొచ్చు కానీ, వీటి వల్ల కొంతమంది మోసపోతున్నారు. గతంలో చాలామందికి ఆర్డర్ పెట్టిన వస్తువు కాకుండా పాడైపోయినా వస్తువులో, పనికిరాని వస్తువులో, అవసరంలేని వస్తువులో డెలివరీ వచ్చాయి. ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు ఒట్టి సామాన్యులకే జరుగడంలేదు అనడానికి తాజాగా నటి సోనాక్షి సిన్హా మోసపోయిన సంఘటన గురించి చెప్పుకోవాలి. 

రూ. 18,000 పెడితే…

సోనాక్షి సిన్హా తనకెంతో ఇష్టమైన ‘బోస్’ హెడ్‌ఫోన్స్‌ను రూ. 18,000 లకు అమెజాన్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసింది. తీరా ఇంటికి వచ్చిన డెలివరీ బాక్స్‌ను తెరిచి చూస్తే సోనాక్షి కళ్లు చెదిరిపోయాయి. బయటకు చూడ్డానికి బ్రాండెడ్ ప్యాకింగే ఉంది కానీ, లోపల తను కొన్న హెడ్‌ఫోన్స్ బదులుగా తుప్పుపట్టిన బోల్ట్ ఉంది. అది చూసి షాక్ అయిపోయింది సోనాక్షి సిన్హా. ఇలాంటి మోసాన్ని అలానే వదిలేయకుండా…ఆ బోల్ట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ” ఎవరైనా 18,000 రూపాయలకు తుప్పు పట్టిన ఇనుప ముక్కను కొనుక్కుంటారా?(ఇది స్టీల్‌దే అనుకోండి). కానీ అమెజాన్‌లో కాదు కాబట్టి మీరు ఆర్డర్ పెట్టిందే మీకు దక్కుతుంది ” అని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 

sonakshi sinha

అమెజాన్ ఇండియాగారు..

మళ్లీ కాసేపటికే ఇంకో పోస్ట్ చేస్తూ…” హే అమెజాన్ ఇండియా! నేను బోస్ హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే ఏం వచ్చిందో మీరే చూడండి. పైకి చూడ్డానికి ప్యాకింగ్ బాగానే ఉంది. బాక్స్‌ను తెరిచి చూస్తే ఇది కనిపించింది. మీ కస్టమర్ సర్వీస్ కనీసం సహాయం కూడా చేయడం లేదు ” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అమెజాన్ ఇండియా స్పందించి…” ఓహ్! ఇది దారుణం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. మా సపోర్ట్ టీమ్‌కి మీ వివరాలు ఇవ్వండి. మేము నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తాం ” అని ట్వీట్ చేశారు. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *