రన్‌వే నుంచి ఎగిరి నదిలో దిగిన విమానం

రన్‌వే నుంచి ఎగిరి నదిలో దిగిన విమానం

ఫ్లోరిడాలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. జాక్సన్‌విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేకి చివరగా ఉన్న సెయింట్ జాన్సన్‌ నదిలోకి విమానం దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 136 మంది ఉన్నారు. గ్వాంటనామో బే నుంచి జాక్సన్‌విల్లేకు బోయింగ్ 737 విమానం బయలు దేరింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 9గంటల 40 నిమిషాలకు ల్యాండ్ అయిన జంబో విమానం ఒక్కసారిగా నదిలోకి దూసుకెళ్లింది.విమానం నదిలోకి దూసుకెళ్లగానే విమానంలోని ప్రయాణికులు భయాందోళనలతో వణికిపోయారు. బయట ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. చిమ్మచీకటిలో ఏమీ కనిపించకపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదిలాఉంటే విమానంలో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నట్లు జాక్సన్‌విల్లే మేయర్ ట్విటర్ ద్వారా తెలిపారు. విమానం నదిలోకి దూసుకెళ్లడంతో విమానం ఇంధనం కాస్త లీక్ అయినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిన పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *