ఫేస్‌బుక్ పేజ్ లైక్ చేసిందని కళ్లు పీకేయాలనుకున్నాడు

ఫేస్‌బుక్ పేజ్ లైక్ చేసిందని కళ్లు పీకేయాలనుకున్నాడు

 

టెక్నాలజీ పుణ్యమా…మనుషుల్లో సున్నితత్వం, మానవత్వం రెండూ లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలకే ఎదుటివ్యక్తులపై అసహనంతో దాడి చేయడమో..కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీసేయడమో చూస్తున్నాం. ఇలాంటి చిన్న కారణంతో ప్రియురాలి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది.

యూకేలోని కెంట్‌లో బాడీ్‌బిల్డర్ డానీ బ్రిడ్జెస్ తన ప్రియురాలిపై దాడికి ప్రయత్నించాడు. కొన్నిరోజుల క్రితం డానీ ప్రియురాలు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టును లైక్ చేసింది. ఈ విషయం తెలిసిన డానీ ఆమెపై కోపంతో ఊగిపోయాడు. నువ్వు ఎవరిదో పేజ్‌ను లైక్ చేయడం ఏంటంటూ ఆమె కళ్లను బలవంతంగా వేళ్లతో పెకిలించడానికి ప్రయత్నించాడు. అతడి నుంచి బయటపడ్డానికి చాలా ప్రయత్నం చేసింది కానీ అతని బలానికి శక్తి సరిపోలేదు. చాలాసేపు పెనుగులాడిన తర్వాత మొత్తానికి అతడి నుంచి తప్పించుకుని.. తన ఫ్రెండ్‌కు రక్షించాలని మెసేజ్ చేసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయినా, డానీ ఇంటి తలుపులు తెరవడానికి నిరాకరించాడు. దీంతో పోలీసులు తలుపులు పగలకొట్టి డానీని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసు గురించి ఈ మధ్యనే కాంటర్బరీ క్రౌన్ కోర్టులో విచారణకు జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలు జడ్జితో మాట్లాడుతూ.. “అతను నా కళ్లను బయటకు లాగేస్తున్నట్లుగా అనిపించింది. కనుగుడ్లు ఊడి బయటకు వచ్చి చచ్చిపోతానేమో భయమేసింది. కళ్ల దగ్గర నాకు బలమైన గాయాలయ్యాయి” అని చెప్పింది. అతడు తనపై దాడి చేయడం ఇదేమీ కొత్త కాదనీ, గతేడాది ఏప్రిల్, నవంబరు నెలల్లో కూడా దాడి చేశాడని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వివరించాడు. దీంతో కోర్టు డానీకి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *