ఆసక్తికర రెస్క్యూ ఆపరేషన్

ఆసక్తికర రెస్క్యూ ఆపరేషన్

బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తున్నది చిరుతపులి కాదు దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ అడవి పిల్లి ఇది దాదాపు ఐదంతస్థుల భవనమంత ఎత్తున్న ఎలక్ట్రిక్ పోల్ అంత ఎత్తు ఎలా ఎక్కిందో తెలియదు ఆరోజు తెలతెలవారుతుండగా పోల్ ఎక్కి కూర్చున్న అడవిపిల్లిని గుర్తించారు స్థానికులు స్థంభం ఎక్కడమైతే ఎక్కింది కానీ దిగలేకపోతోంది.హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ సిబ్బంది ఎలా దించాలా అని తలలు పట్టుకున్నారు అదేమో ఎలక్ట్రిక్ పోల్ కరెంట్ షాక్ తగలకుండా అడవిపిల్లిని కిందకి దించాలి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు అప్పటికే రెండు గంటలు గడిచిపోయాయి ఆలోచించి… ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు అడవిపిల్లి తనంతట తానే దిగేలా చేయాలనుకున్నారు కానీ ఎలా…? ఇంతలో మరో రెండు గంటలు గడిచిపోయాయి అడవిపిల్లి మాత్రం బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూనే ఉంది తప్ప దిగే ప్రయత్నం ఏ మాత్రం చేయడం లేదు ఘటనా స్థలానికి ఓ క్రేన్ తెప్పించారు అధికారులు క్రేన్‌ని అడవిపిల్లి కూర్చున్న ఎత్తుకు చేర్చి దాన్ని ఎలాగోలా దిగే ప్రయత్నాలు చేశారు

నెమ్మదిగా పోల్ దిగే ప్రయత్నం చేశారు రెస్క్యూ సిబ్బంది గంటలు గడుస్తున్నాయి అడవిపిల్లి మాత్రం చలించడం లేదు మరో రెండు గంటలూ గడిచిపోయాయి చివరకు నెమ్మదిగా కదిలింది పిల్లి ఒకటి… రెండు…. మూడు… నాలుగు… ఐదు…ఇలా ముప్పై అడుగులు వేసి కిందకి దిగింది వైల్డ్ క్యాట్ ఇలా దిగిందో లేదో కిందకు చేరుకుంటుండగానే చటుక్కున దూకేసింది దూకీ దూకగానే అడవిలోకి చెక్కేసింది హమ్మయ్య అని అటవీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు మొత్తం ఆరున్నర గంటల ఆపరేషన్ చివరకు అడవిపిల్లికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *