బోటు బోల్తా..65 మందికిపైగా మృతి

బోటు బోల్తా..65 మందికిపైగా మృతి

మ‌ధ్యధార స‌ముద్రంలో బోటు బోల్తాప‌డింది. టునీషియా తీరం దగ్గర జ‌రిగిన ఘ‌ట‌న‌లో సుమారు 65 మంది శ‌ర‌ణార్థులు చ‌నిపోయారు. ఈ విష‌యాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. బోటులో ప్రయాణిస్తున్న మ‌రో 16 మందిని ర‌క్షించిన‌ట్లు అధికారులు తెలిపారు. లిబియాలోని యూరప్ వెళ్తున్న సమయంలో బ‌ల‌మైన అల‌లు రావ‌డం వ‌ల్ల బోటు బోల్తా ప‌డిన‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ ఏడాది మొద‌టి నాలుగు నెల‌ల్లోనే లిబియా నుంచి యూరోప్ మ‌ధ్య ఉన్న జ‌ల‌మార్గంలో సుమారు 164 మంది చ‌నిపోయిన‌ట్లు యూఎన్ సంస్థ వెల్ల‌డించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *