కాంగోలో ఘోర పడవ ప్రమాదం

కాంగోలో ఘోర పడవ ప్రమాదం

కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కివూ సరస్సులో పడవ మునిగి సుమారు 150 మంది చనిపోయారు. సోమవారం ఈ ప్రమాదం జరగ్గా.. బుధవారం నుంచి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ప్రయాణికులంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయినప్పటికీ గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

ఇదిలాఉంటే… పడవలో దాదాపు 150 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. బరువైన సామాగ్రి ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు అందకపోవడంతో తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయిందని సమాచారం. పడవ ప్రమాదంపై కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకేడి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *