తెలంగాణ లో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ నేతలే టార్గెట్ !

తెలంగాణ లో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ నేతలే టార్గెట్ !

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కన్నుపడింది . అధికార పార్టీలకు ఆల్టర్నేట్ గా ఎదగడానికి స్కెచ్ వేస్తోంది . ప్రతిపక్ష పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది . అధికార బలం తో తెలంగాణ లో కాంగ్రెస్ , ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ని మింగేయడానికి పావులు కదుపుతోంది .మరి అనుకున్నలక్ష్యాన్ని బీజేపీ సాధిస్తుందా ? బీజేపీ వేసే వలలో చిక్కే ఆ నేతలెవరు ? టార్గెట్ 2024.

2019 ఎన్నికల్లో దేశ ప్రజలు మరోసారి బీజేపీ కి అధికారాన్ని కట్టబెట్టాయి . పూర్తి మెజారిటీతో నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాన మంత్రి అయ్యారు . హిందీ బెల్ట్ లో బీజేపీ తన హవా ను ఈ ఎన్నికల్లోనూ కొనసాగించింది . సౌత్ లో మాత్రం ఒక్క కర్ణాటక మినహాయిస్తే ఎక్కడ ప్రభావం చూపించలేకపోయింది . ఇప్పుడు అమిత్ షా కన్ను రెండు తెలుగు రాష్ట్రాలపై పడింది . టీఆరెస్ , వైసీపీ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది . బీజేపీ ట్రబుల్ షూటర్ రామ్ మాధవ్ రంగం లోకి దిగారు . రెండు రాష్ట్రాల నాయకులతో రహస్య చర్చలు జరుపుతున్నట్టు సమాచారం . ఏపీలో టీడీపీ , తెలంగాణాలో కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ పనిచేస్తోంది . ఈ రెండు పార్టీల్లో ఉన్న ముఖ్య నాయకులను బీజేపీ ఆకర్షించే పనిలో ఉంది .

తెలంగాణాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారి విశ్లేషిస్తే …టిఆరెస్ దెబ్బకి కాంగ్రెస్ కకావికలమవుతోంది . ఏకంగా సీఎల్పీ , టీఆరెస్ లో విలీనమైన పరిస్థితి . కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయి . ఇదే అదనుగా బీజేపీ అధికార టిఆరెస్ కి ఆల్టర్నేట్ గా ఎదగాలని గట్టి ప్రయత్నం చేసింది .కాంగ్రెస్ లో ఉన్న ముఖ్య నేతలను టార్గెట్ చేసింది బీజేపీ . కీలక నేతలను పార్టీలో చేర్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు . తెలంగాణ లో కాంగ్రెస్ ను లేకుండా చేస్తే , భవిష్యత్తు మనదే అన్న ఆలోచనతో ముందుకెళ్తోంది . మొన్నటి ఎన్నికల్లో బీజేపీ కూడా ఊహించని విధంగ 4పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది . ఈ విజయం బీజేపీ లో నూతన ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి . కిషన్ రెడ్డి ని హోమ్ శాఖ సహాయ మంత్రిని చేయడం కూడా తెలంగాణ లో పాగా వేయడానికే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే చెప్పాలి . భారీగా నేతలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్ కు భారీ నష్టంతో పాటు బీజేపీ కి లాభం వస్తుందనడంలో సందేహం లేదు .

ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని మింగేయడానికి బీజేపీ రెడీ అవుతోంది . 100 మంది టీడీపీ నాయకులు బీజేపీ తో టచ్ లో ఉన్నారని బీజేపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు . ఏకంగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి .టీడీపీ నాయకులు ఎక్కడా వెళ్లట్లేదు , టీడీపీ లోనే ఉంటామని గట్టిగా చెప్పలేకపోతున్నారు . బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్న విషయాన్నీ కొందరు నాయకులూ అంగీకరిస్తున్నారు . మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం టీడీపీ ని కుంగదీసింది . అత్యంత దారుణ ఓటమితో అసలు భవిష్యత్తులో టీడీపీ ఉంటుందా ? ఉండదా ? అన్న చర్చ కూడా మొదలైంది .ఈ పరిస్థితుల్లో టీడీపీ ముఖ్య నేతలు బీజేపీ నేతలకు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది . బీజేపీ కి తెలంగాణ లో ఉన్న పరిస్థితి ఆంధ్ర లో ఉండకపోవచ్చు . ప్రత్యేక హోదా , విభజన హామీల విషయం లో రాష్ట్రానికి అన్యాయం చేశారన్న భావన ప్రజల్లో ఉంది . ఈ పరిస్థితుల్లో టీడీపీ నేతలు బీజేపీలోకి వెళ్లిన ప్రజలు బీజేపీ ని ఆదరిస్తారా అన్నది చూడాలి . ఒకవేళ రాబోయే 5సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ పనులు చేస్తే మాత్రం బీజేపీ బలపడే అవకాశాలు ఉండొచ్చు .

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది బీజేపీ . మరి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పుంజుకుంటుందా లేదాఅన్నది చూడాలి .

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *