అమిత్‌షాకు ఘోర అవమానం

అమిత్‌షాకు ఘోర అవమానం
పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఘోర అవమానం జరిగింది. జనం లేక అమిత్‌షా సభ వెలవెలబోయింది. బీజేపీ చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి అమిత్‌షా పలాస వచ్చారు. అమిత్‌షా రాక సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసింది బీజేపీ రాష్ట్ర కార్యవర్గం. వేలాది మంది కూర్చునేందుకు అనువుగా కుర్చీలు కూడా ఏర్పాటు చేసారు. అయితే ప్రజలు మాత్రం అమిత్ షా ను తిరస్కరించారు.
 
Amit Shah Public Meeting in Palasa

బ్రతిమిలాడటంతో

జనం లేక కుర్చీలను ముందే సర్దేసారు బీజేపీ కార్యకర్తలు. డబ్బులు ఇస్తాం అన్నా ప్రజలు రాని పరిస్థితి. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో, పలాసలో బహిరంగ సభను రద్దు చేసుకున్నారు అమిత్‌షా. అయితే అక్కడి నేతలు మా పరువు పోతుంది, ఇలా చెయ్యకండి అని బ్రతిమిలాడటంతో అమిత్ షా సర్దుకుపోయారు. ఉన్న కొద్దిమందిని ఉద్దేశించి ప్రజాచైతన్య యాత్ర రథంపై నుంచే ప్రసంగించారు అమిత్‌షా. ప్రజాస్పందన లేకపోవటంతో వెలవెలబోయిన బహిరంగ సభా వేదికను చూసి కన్నాకు చురకలు అంటించారు. ప్రజలు రాకపోవటంతో ప్రజాచైతన్య యాత్ర రథం వరకే పరిమితం చేసారు బీజేపీ నాయకులు.

ఇక త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ రానున్నారు. అమిత్‌ షా సభకు జనాలను సేకరించలేని ఏపీ బీజేపీ, ఇక మోదీ సభను ఎలా సక్సెస్‌ చేస్తుందో చూడాలి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *