లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోట నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. కోట నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓం బిర్లా కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌నారాయణ్‌ మీనాపై 2.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు.

విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓమ్‌ బిర్లా.. అంచెలంచెలుగా ఎదిగారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఇక 2003లో తొలిసారిగా కోట సౌత్‌ నియోజకవర్గం నుంచి రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో కోట నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *