'మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు' బీజేపీ ఎమ్మెల్యే కూతురి ఆవేదన

'మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు' బీజేపీ ఎమ్మెల్యే కూతురి ఆవేదన

ఆమె ఎమ్మెల్యే కూతురు. ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో విషయం చెప్పితే కుటుంబసభ్యులు ఇంతెత్తున లేచారు. అతన్ని మర్చిపొమ్మని వార్నింగ్ ఇచ్చారు. అయితే అతనిపై ప్రేమ చంపుకోలేక కుటుంబసభ్యుల కళ్లుగప్పి ఇంట్లో నుంచి బయటపడింది. కోరుకున్న వాడితో మూడు ముళ్లు వేయించుకుంది. ఇక అప్పటి నుంచి ఆ దంపతుల కష్టాలు మొదలయ్యాయి. తండ్రి గూండాలను పంపి బెదిరిస్తుండటంతో రక్షణ కల్పించండంటూ వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి

సాక్షి పోస్ట్ చేసిన వీడియోలో తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన వద్ద పనిచేసే కొంతమంది గూండాలు తమను వెంబడిస్తున్నారని, వారిని అలాగే వదిలేస్తే తమను చంపేస్తారని ఆవేదన వ్యక్తంచేసింది. తన ఇష్టపూర్వకంగానే అజిత్‌ను పెళ్లి చేసుకున్నాడని, అందులో ఎవరి ఒత్తిడి లేదని చెప్పింది. అయితే ఈ విషయాన్ని తండ్రి అర్థం చేసుకోవడంలేదని, అందుకే రోజూ గూండాలను పంపి బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తంచేసింది. దయచేసి మాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.

సాక్షి మిశ్రా భర్త అజితేశ్ సైతం ఎమ్మెల్యే అనుచరులు తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్న భయం వ్యక్తం చేశారు. తాను దళితుడినైనందున వారు చంపేదాక వదలరని అంటున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజేశ్ మిత్రాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కూతురి వీడియో వైరల్ కావడంతో అది పోలీసుల దృష్టికి వెళ్లింది. సాక్షి అభ్యర్థనపై స్పందించిన డీఐజీ కొత్త దంపతులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే వారు ఎక్కడ ఉన్నారో తెలిస్తే భద్రత కల్పించడం సాధ్యమవుతుందని చెప్పారు.

నేను ఒక దళితుడిని. మమ్మల్ని చంపేదాకా వాళ్లు వదలరు. ఈరోజు కూడా ఎమ్మెల్యే మనుషులు మా వెంట పడ్డారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం. దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీని కోరుతున్నాం

నా ఇష్ట పూర్వకంగా అజిత్‌ను పెళ్లి చేసుకున్నాను. ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. కానీ మా నాన్నకు ఇది అర్థం కావడం లేదు. అందుకే రోజూ తన గూండాలను పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. ఇప్పటికే చాలా అలసిపోయాను. ఒకవేళ వాళ్ల చేతికి దొరికితే మమ్మల్ని కచ్చితంగా చంపేస్తారు. దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరుతున్నాను’

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *