బీజేపీ నేతలను పాలన గురించి అడిగితే..మీ పనంతే!

బీజేపీ నేతలను పాలన గురించి అడిగితే..మీ పనంతే!

బీజేపీ నేతలపై ప్రజలకుండే విశ్వాసం రోజురోజుకి తగ్గిపోతోంది. దశాబ్దాలుగా పదవిలో ఉండి కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని చెబుతూ మోదీ వస్తే దేశం రూపురేఖలే మారిపోతాయనే ప్రచారంతో, దేశం అభివృద్ధిలోకి దూసుకుపోతుందనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. ఇపుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రజలకు ఏం చేసింది అని ప్రశ్నిస్తే…బీజేపీ నేతల నుంచి వస్తున్న సమాధానం వింతగా వుంది. అదేంటో తెలుసుకుందాం!

పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఒక బహిరంగ సభలో బీజేపీ నేత, పర్మేశ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సభలో ఉన్న ఒక వ్యక్తి పర్మేశ్‌ని ఉద్దేశిస్తూ…ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారూ అని ప్రశ్నిస్తే..దానికి ఆయన సమాధానాన్ని దాటవేస్తూ…సభికులనుద్దేశించి ‘భారత్ మాతాకి జై’ అని నినదించాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే..ఆయన స్పందనకు ముందు..ప్రశ్నించిన వ్యక్తి చదువు విషయం అడిగి తెలుసుకున్న బీజేపీ నేత, సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం వింతగా ఉంది.

ఇలాంటి సంఘటనే గత ఏప్రిల్‌లో మరో బీజేపీ నేత, బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ భార్య కిరణ్ ఖేర్ రోడ్‌షోలో కూడా చోటుచేసుకుంది. రోడ్‌షోలో భాగంగా ప్రముఖ మీడియా ప్రతినిధి ఒకరు…అనుపమ్ ఖేర్‌ని ఉద్దేశిస్తూ..మీ భార్య విషయంలో.. రాజకీయాలకంటే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలున్నాయి దీని గురించి మీరేం చెప్తారు అని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పలేకపోయిన అనుపమ్‌ఖేర్ ‘భారత్ మాతాకీ జై’ అని స్పందించడంతో షాక్ అవడం రిపోర్టర్ వంతయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *