ఏమిటీ సంచలన వ్యాఖ్యలు కిషన్ జీ..!

ఏమిటీ సంచలన వ్యాఖ్యలు కిషన్ జీ..!

“దేశంలో ఎక్కడ టెరరిస్టు దాడులు జరిగినా వాటికి హైదరాబాద్‌తో లింక్ ఉంటోంది.” నాలుగు రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలివి. “తెలంగాణలో రాజకీయ హత్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది.”శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డే ఈ వ్యాఖ్యలనూ చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. దీంతో కమలానాథుల్లో కలవరం మొదలైంది.

అంతరాథ్యం ఏమిటో…

అసలు ఈ వ్యాఖ్యల్లో అంతరాథ్యం ఏమిటో తెలియక పార్టీ సీనియర్ నాయకులతో పాటు అధిష్టానమూ కలత చెందుతున్నట్టు తెలుస్తోంది. తీవ్రవాదులకు హైదరాబాద్‌తో లింక్‌ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై పార్టీ చీఫ్ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంఐఎం అధినేత అసవుద్దీన్ ఓవైసీ కూడా మండిపడ్డారు. ఇది జరిగి నాలుగు రోజుల గడవక ముందే హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తోందని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఈ తాజా వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన కోసం జరిగిన ఉద్యమం నుంచి రెండవ సారి ప్రభుత్వం ఏర్పడినంత వరకూ ఒక్క రాజకీయ హత్యా జరగలేదని వారంటున్నారు.

ఇప్పుడు మాట్లాడుతున్నాడు…
పదిరోజుల క్రితం వరకూ రాజకీయ హత్యలపై ప్రస్తావించని కిషన్ రెడ్డికి… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే తెలంగాణరాజకీయ హత్యల రాష్ట్రంగా కనిపించిందా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలను… రాజకీయాలతోనే ఎదుర్కుంటారు తప్ప వ్యక్తులను హత్య చేసి రాజకీయాలను నెరపరని మండిపడుతున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులూ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం విశేషం. “మహాబూబ్ నగర్‌లో జరిగిన బిజేపీ కార్యకర్త హత్య ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తేలకుండానే హోంశాఖ సహాయ మంత్రి రాజకీయ హత్యలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించడం సరైంది కాదు” అంటూ పేరు వెల్లడించేందుకు అంగీకరించని ఓ సీనియర్ నాయకుడు అన్నారు. జాతీయా స్దాయిలో కీలకమైన పదవులలో ఉన్నవారు ఆచితూచి స్పందించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *