కోర్టు ఆదేశాలు సరిగా చదవకుండా వ్యక్తిని రోజంతా జైల్లో ఉంచిన పోలీసులు

కోర్టు ఆదేశాలు సరిగా చదవకుండా వ్యక్తిని రోజంతా జైల్లో ఉంచిన పోలీసులు

మనకు రాని విషయంలో జోక్యం చేసుకోకూడదు. తెలియని విషయాన్ని నలుగురిని అడిగైనా నేర్చుకోవాలనేది పెద్దలు చెప్పిన మాట. ఆంగ్లం రాకపోతే రాదని ఒప్పుకోవడంలో తప్పులేదు. ఎవరూ కూడా పుట్టగానే పరాయి భాషలు నేర్చుకోలేరు. అలాగే సగం సగం తెలిసి పూర్తీ పరిజ్ఞానాన్ని చూపించాలనుకోవడం కూడా ఎన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. ఇలా రాని భాషలో పరిజ్ఞానాన్ని చూపించారు పోలీసులు.

డిస్ట్రెస్ వారెంట్

డిస్ట్రెస్ వారెంట్ చూడలేనంత స్ట్రెస్…

కోర్టువారు రాసిన ఇంగ్లీష్‌ను సరిగా అర్థం చేసుకోకుండా ఓ వ్యక్తిని ఒక రోజంతా జైల్లో ఉంచారు. వివరాల్లోకి వెళితే…బీహార్‌లోని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. పాట్నాకు చెందిన నీరజ్ కుమార్ అనే వ్యాపారి తన భార్యతో విడాకుల కోసం కోర్టులో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంగ్లిష్ భాషలో ఉన్నాయి. అందులో ‘ వారెంట్ ‘ అనే పదం ఉంది. ఆ మాటను పోలీసులు అరెస్ట్ వారెంట్ అనుకుని నీరజ్‌ను నవంబర్ 25న అరెస్ట్ చేసారు. ఆరోజు రాత్రంతా జైల్లోనే ఉంచారు. అయితే…వాస్తవానికి అది అరెస్ట్ వారెంట్ కాదు. ఆ పదం ‘ డిస్ట్రెస్ వారెంట్ ‘. రోజంతా ఉద్యోగం చేసిన స్ట్రెస్‌లో ఉన్నారేమో…డిస్ట్రెస్ అనే పదాన్ని పోలీసులు చదవలేకపోయారు. వ్యాపారి నీరజ్ ఆస్తులు, ఆర్థిక వివరాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశం ఇచ్చింది. వ్యాపారి తన భార్యకు భరణం చెల్లించట్లేదు. ఈ కారణంగా అతడి ఆర్థిక వివరాలు ఇవ్వాల్సిందని కోర్టు చెప్పింది.

వివరణ ఇచ్చుకున్న సీనియర్ అధికారి!

తర్వాత, ఓ సీనియర్ పోలీసు అధికారి చెబుతూ…కోర్టు ఆదేశం ఆంగ్లంలో ఉందని, నీరజ్‌ను అరెస్ట్ చేయాలని లేదని ఆయన వివరణ ఇచ్చారు. జెహానాబాద్ ప్రాంతానికి చెందిన నీరజ్‌పై అతని భార్య రెండుసార్లు వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. 2014లో నీరజ్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *