బిగ్‌బాస్ సీజన్ 3 ప్రోమో రిలీజ్..హోస్ట్‌గా ఆ హీరోనే..

బిగ్‌బాస్ సీజన్ 3 ప్రోమో రిలీజ్..హోస్ట్‌గా ఆ హీరోనే..

ఎప్పుడా ఎన్న‌డా అంటూ బుల్లితెర ప్రేక్ష‌కులని ఊరిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 3 త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుందని బిగ్‌బాస్‌ అభిమానులకు నిర్వాహకులు గుడ్‌న్యూస్‌ చెప్పేశారు.దీంతో సీజన్ 3 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్….ఇంతకీ బిగ్‌బాస్‌ సీజర్ త్రీ ఎప్పుడు ప్రారంభం కాబోతుందో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ…నార్త్‌లో స్టార్ట్ అయిన బిగ్ బాస్ మానియా సౌత‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది.. తెలుగులో రెండు సీజ‌న్స్‌లోను బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ రియాలిటీ షో ప్రస్తుతం దక్షిణాది పాగావేసింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఫుల్‌ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఇప్పటికే రెండు సీజన్‌లు కంప్లీట్ చేసుకుంది.. ఫస్ట్ సీజన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ఆ క్రార్యక్రమంపై ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు. కానీ రెండో సీజన్‌కు న్యాచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా చేసినప్పుటు కాస్త తడబడ్డాడు. అయితే ఈ సారి బిగ్‌బాస్‌ను గతంలో మాదిరి కాకుండా సరైన మార్గంలో నడిపించాలని.మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిన కింగ్‌ నాగార్జున.. బిగ్‌బాస్‌ సీజన్ 3కి హోస్ట్‌గా ఫైనల్ చేశారు నిర్వాహాకులు.జూలై మూడోవారం లేదా చివరివారంలో ఈ క్రార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.. సీజన్ త్రీ ఎలా ఉండబోతుందో అని బిగ్‌బాస్‌ బృందం చిన్న హింట్ ఇస్తు దీనికి సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేశారు. పఈసారి బిగ్‌బాస్‌ మరింత కొత్తగా ఉండబోతోందని ప్రోమోను చూస్తుంటూనే తెలుస్తోంది. ఈసారి కంటెస్టెంట్‌లుగా టిక్‌టాక్‌ స్టార్లు, యూట్యూబ్‌ స్టార్లు, సింగర్లు, యాంకర్లు ఇలా ప్రతి ఒక్క క్యాటగిరీ నుంచి టాప్‌ సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అయితే కామ‌న్ మ్యాన్‌కి ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో ఎంట్రీ లేన‌ట్టు స‌మాచారం. మరి సీజన్ ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *