లండన్ వీధుల్లో ఇండియన్ చిరుతిళ్లు!

లండన్ వీధుల్లో ఇండియన్ చిరుతిళ్లు!

మనదేశం చిరుతిళ్ల కు బాగా పాపులర్. చల్లని సాయంత్రం లో సరదాగా అలా బయటకు వెళ్లితే ఎదో ఒకటి కడుపులో పడేయాల్సిందే… ప్రతి గల్లీ చివర చాట్‌ అమ్మే బండ్లు కనిపిస్తాయి ..అయితే ఈ సంసృతి విదేశాలకు కూడా పాకింది. ఏకంగా భారత్‌ కే సొంతమైన చిరుతీండ్లను నడిరోడ్డు మీద అమ్మేస్తున్నారు.. అంతేకాదు జనం ఎగబడి మరి తినేస్తున్నారు.. ఇంతకీ ఇందంతా ఎక్కడా అని చూస్తున్నారా? అయితే ఓ సారి లండన్‌ వెళ్ళి వద్దాం రండి…

చూశారా.. ఇక్కడ చకచకా భేల్‌పూరి తయారు చేస్తున్న వ్యక్తిని..ఈయన జీవనాధరం కోసమో..బతుకు బండిని లాగడం కోసమో ఈ వృత్తిని ఎంచుకోలేదు.. తన అభిరుచిని తోటివారికి పంచడం కోసం చాట్‌ బండిని నడిపిస్తున్నారు..అంతేకాదు తన స్పెషల్‌ వంటకం గొప్పతనాన్ని నలుగురికి వివరించి మరీ చెబుతున్నారు.

భారత్ వీధుల్లో ఎక్కడ చూసినా భేల్ పురీ బళ్లు కనిపించడం సర్వసాధారణం. కానీ అదే దృశ్యం లండన్ వీధుల్లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. నవ్వులాట కాదు.. ఇది నిజం. లండన్ లో మన మరమరాల మసాలాని ఒక ఇంగ్లిష్ షెఫ్ అమ్ముతున్నాడు. అది కూడా సూపర్ హిట్టయి ఇప్పుడు ఆయన బండి యమ పాపులర్ గా మారింది.

బ్రిటన్ కి చెందిన యాంగస్ దీనోన్ వృత్తిరీత్యా ఒక షెఫ్. ఓ సారి భారత్ పర్యటనకు వచ్చినపుడు ఇక్కడ వీధుల్లో దొరికే ఆహారపదార్థాలను రుచి చూశాడు. అంతే.. ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిన వెంటనే కోల్ కతా వీధుల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఝాల్మురీని అమ్మడం ప్రారంభించాడు. తన బండికి ఝాల్మురీ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టాడు. దానికి ఉపశీర్షిక ఎవ్రీబడీ లవ్, లవ్ ఝాల్మురీ ఎక్స్ ప్రెస్! ఇప్పుడు ఈయన దగ్గర భారతీయులే కాదు.. బ్రిటన్ దేశస్థులు కూడా లైన్లలో నిలబడి మరీ ఝాల్మురీ మసాలాను కొనుక్కొని తింటున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *