ఏపీ లో మళ్లీ సంక్రాంతి వాతవరణం

ఏపీ లో మళ్లీ సంక్రాంతి వాతవరణం

డబ్బు..డబ్బు..డబ్బు.. దేనికైనా డబ్బే కావాలి ,ఇదే మనుష్యులను ఎక్కడికైనా తీసుకెళుతుంది..ఎందాకానైనా లాక్కెళుతుంది. ఇక ఈజీ మనీ అయితే చెప్పనవసరం లేదు.., ఎక్కడ ఈజీ మనీ లభిస్తుందో అక్కడ వాలిపోతారు..లేనివి క్రియోట్ చేసి వ్యాపారం చేస్తారు..తాజాగా ఇలాంటీ వారికి ఏపీఎన్నికలు వరం గా మారాయి.ఫలితాల పై బెట్టింగ్‌ల మీద బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఇంతకీ ఏపీ ఫలితాలపై బెట్టింగ్‌ రాయుళ్ల జోరు ఎలా ఉంది.. వాచ్‌ దిస్‌ స్టోరి

కోడి పందాలను త‌ల‌ద‌న్నే బెట్టింగులు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో నడుస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై పందెంరాయళ్లు కాళ్లు దువ్వుతున్నారు. మూడు నెలలు దాటకముందే సంక్రాంతి మళ్లీ వచ్చిందా అనే రీతిలో పందెపు రాయుళ్ల జోరు కొనసాగుతుంది.తొలి దశలోనే ఎన్నికలు ముగియడంతో.. ఫలితాల కోసం మే 23 వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి. పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య 42 రోజుల వ్యవధి ఉండడంతో ప్రధాన పార్టీల అధ్యక్షులు, అభ్యర్థులకు గెలుపోటముల టెన్షన్‌ పట్టుకుంది.అయితే ఈ టెన్షన్‌ వాతవరణమే పందెపు రాయళ్లకు వరం గా మారింది.

మరోవైపు భారీగా పందేలు కాసేందుకు డబ్బు సంచులతో సిద్ధమైపోయారు బెట్టింగ్‌ రాయుళ్లు . ఫలితాలపై పార్టీలు, అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతుంటే.. బెట్టింగ్‌ ట్రెండ్‌ మార్కెట్‌ను ఊపేస్తోంది. సైకిల్ స్పీడెంత..? ఫ్యాను గాలి ఐదు మీదుందా.?డిపాజిట్లు కోల్పోయేదెవరు.. మూడోస్థానంలో ఉండే పార్టీ ఏదన్నదానిపైనా భారీగా పందేలు కాస్తున్నారు. ఎన్నికల్లో మంచి ట్రాక్‌ రికార్డు ఉన్నవారు మళ్లీ గెలుస్తారని బెట్టింగ్‌ పెట్టడం సహజం. ఈసారి ఇందుకు భిన్నంగా ఓడిపోయేదెవరన్న దానిపైనే ప్రధానంగా పందేలు కాయడానికి ఆసక్తి చూపుతున్నారు.

కోడి పందాల బెట్టింగుల కంటే కూడా ఇప్పుడు రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై భారీ స్థాయిలో బెట్టింగులు ఉన్నాయట. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే పార్టీ మొదలు నియోజకవర్గాల వారీగా పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములపై , మెజారిటీలపై , జిల్లాలలో ఎన్ని సీట్లు వస్తాయి అనే కోణంలో బెట్టింగులు కాస్తున్నారట.

మరోపైపు ఏపీ వ్యాప్తంగా 5 వేల నుంచి 25 లక్షలు, ఆపైనే పందాలు సాగుతున్నాయని సమాచారం. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో గెలుపొందుతుంది.ఎక్కడెక్కడ విజయాలు నమోదు  చేస్తుంది అన్న అంశాలపై బెట్టింగులు కాస్తున్నారు..ఇప్పటికే కోట్ల రూపాయల పందాల ఒప్పందాలు జరిగిపోయాయని. రోజులు గడిచే కొద్ది మరిన్ని పందాలు జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు పందెపు రాయళ్లు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *