పందెంరాయుళ్ల టెన్షన్..

పందెంరాయుళ్ల టెన్షన్..

పందమంటే పందమే.. గెలుపు గుర్రాలమీద అందరూ కాస్తుంటారు. గెలుస్తాయో లేదో తెలియని గుర్రాల మీద పందం కాయాలంటే దమ్ముండాలి. సొమ్ములుండాలి..రిస్క్‌ ఉంటుంది.. అదృష్టం వరిస్తే ఫలితం కూడా ఉంటుంది.. యమ రంజుగా సాగిన ఏపీ సార్వత్రిక ఎన్నికలపై పందం రాయుళ్ల దృష్టా పడింది. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ 10 కి 100.. 100కు వెయ్యి.. వెయ్యికి లక్ష.. లక్షకు ..కోటి అంటూ దూకుడు పెంచుతున్నారు. డబ్బులు చేతిలో లేకపోతే ప్లాట్లను కూడా పందం పెడుతున్నారు. ఫలితాలు వచ్చిన రోజు కొన్ని కోట్ల రూపాయిల మేరకు రిజిష్ట్రేషన్లు .. నోట్ల కట్టలు చేతులు మారనున్నాయి.

మే 23 కోసం బరిలో ఉన్న నేతల కంటె పందం రాయుళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓ పక్క టెన్షన్‌ .మరో పక్క భయం బెట్టింగ్ రాయుళ్లను వెంటాడుతుంది. మొదటి సారి బెట్టింగ్‌ కట్టిన వారి సంగతి ఇక చెప్పనక్కరలేదు…దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అంశం పై దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. .. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ ఏ నలుగురు చేరినా…అక్కడ రాజకీయాలు గురించే చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని కట్‌ చేస్తే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దాని పైన కోట్లలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి..ఎన్నికల్లో బెట్టింగ్ లు జరగడం సర్వ సాధారణమే అయినా…ఈ సారి జరుగుతున్న బెట్టింగ్ లు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు.

వైసీపీ అధికారంలోకి వస్తుందని కొందరు .. మళ్లీ టీడీపీ అధికారం చేజిక్కించుకుంటుందని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. ఏప్రిల్‌ 11 న పోలింగ్‌ ముగియడంతోనే ఏపీలో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. విజయవాడ, గుంటూరు జిల్లా భారీ స్థాయిలో పందంరాయిళ్లు కాలుదువ్వుతున్నారు. ఎవరి స్థాయిలో వారు లక్షలు.. కోట్లు పందాలు కాస్తున్నారు. డబ్బు రూపంలో జరిగే బెట్టింగ్‌ ఒక ఎత్తైతే రాజధాని రైతులు తమకు కేటాయించిన ప్లాట్లను సైతం బెట్టింగ్‌లు కాస్తున్నారు. మందడం, వెలగపూడి, మల్కాపురం, రాయపూడి, వెంకటపాలెం గ్రామాల్లో ప్లాట్ కి ప్లాట్ అనే విధంగా బెట్టింగ్ లు కాసుకున్నారు. గెలుపొందిన వారికి 24 గంటల్లో రిజిష్ట్రేషన్‌ చేసేలా కూడా ఒప్పందం కుదుర్చుకుంటున్నారని సమాచారం. . 250 గజాలు, 400 గజాల ప్లాట్ల ఎక్కవగా బెట్టింగ్ కట్టారని తెలుస్తోంది.

ప్రశాంతంగా ఉన్న బెట్టింగ్ రాయిళ్లకు కౌటింగ్ సమయం దగ్గర పడుతుండంతో టెన్షన్ పడిపోతున్నారట.. రోజుకోక సర్వేలు సోషల్ మీడియాలో రావడం..ఇరు పార్టీల నేతలు తమ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుండడంతో.. బెట్టింగ్ రాయళ్లు వెన్నులో వణుకు పుడుతుందట.. ఈ టెన్షన్ మా వల్లా కాదు బాబోయే అంటున్నారట బెట్టింగ్ రాయళ్లు..ఇక కొంతమంది బెట్టింగ్ రాయళ్లు అయితే ఈ టెన్షన్ తట్టుకోలేక బీపీ టాబ్లెట్స్ కూడా వాడుతున్నారట.. ఇక మొదటి సారి బెట్టింగ్ కాసిన వాళ్ల పరిస్థితి మరింత ఘోరంగా తయారైందట.. పోలింగ్ తర్వాత ..ఎన్నికల వేడిలో బెట్టింగ్ లు కట్టిన వారు..ఇప్పుడు బెట్టింగ్ లు వెనక్కి తీసుకోవాలని చూస్తున్నారట..కానీ ఒకసారి బెట్టింగ్ కాసిన తర్వాత..వెనక్కి తగ్గితే… 50శాతం తగ్గించుకుని మాత్రమే ఇస్తామని చెబుతుండడంతో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కోపోయామా అని ఆవేదన చెందుతున్నారట. దీంతో చేసేది ఏమీలేక.. మే 23 కోసం ఎదురు చూస్తున్నారట..మొత్తానికి బెట్టింగ్ ఈ సారి ఎన్నికలు రాయిళ్లలకు కొత్త అనుభూతులను తీసుకొస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *