బిచ్చగాడే కానీ, దానగుణంలో సంపన్నుడు!

బిచ్చగాడే కానీ, దానగుణంలో సంపన్నుడు!

ఆయనొక బిక్షగాడు…పేరు చెబోలు కామరాజు వయసు 74 సం” శ్రీకాకుళం జిల్లా ఆయుధాల వలస మండలం ఒప్పంగి గ్రామం ఆయనదిి… చాలా వ్యాపారాలు చేసి నష్టపోయి చివరకు ఏమి చేయాలో అర్థంకాక భిక్షాటన వృత్తిని ఎంచుకున్నాడు… గత 20 సంవత్సరాల నుంచి విజయనగరం జిల్లా చీపురుపల్లి నీలకంటేశ్వర స్వామి ఆలయంలోనే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు…అయితే గత 20 సంవత్సరాలుగా నీలకంటేశ్వర స్వామి ఆలయంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న కామరాజుకు ఎవరూ లేరు అయితే …. భిక్షాటన చేస్తూ సంపాదించిన డబ్బులను ఏమి చేయాలి ఎవరికివ్వాలి అని ఆలోచించి …. తను భిక్షాటన చేస్తున్న సమయంలో భక్తులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి తన దగ్గర ఉన్న డబ్బులతో ఆలయంలో రేకుల షెడ్లు నిర్మించి తనకు దానం చేసిన భక్తులకు ఉపయోగపడే విధంగా ఉండాలని భావించాడు…. ఇంకేముంది తనదగ్గర ఉన్న డబ్బులను తీసి ఆలయ ప్రాంగణంలో షెడ్లు నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు…ఎవరికి వారే ఎమునతీరే అని జీవిస్తున్న నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు మానవత్వానికి సేవా స్ఫూర్తికి మారుపేరుగా నిలుస్తున్నాయి….

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *