మైదానంలో తేనేటీగల ఎంట్రీతో మ్యాచ్ ఆగిపోయింది

మైదానంలో తేనేటీగల ఎంట్రీతో మ్యాచ్ ఆగిపోయింది
ఏ మైదానంలోనైనా క్రికెట్ జరుగుతున్నపుడు ఒక జట్టువారు ప్రత్యర్థి ఆటగాళ్లపై బ్యాట్‌తో ఒకరు, బంతితో ఒకరు దాడి చేయడం సహజం. అది ఆటగాళ్ల స్పూర్తి. వారి నైపుణ్యం బట్టి మ్యాచ్ ఫలితం ఉంటుంది. కానీ, తిరవనంతపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ మైదానంలో మాత్రం ఆటగాళ్లు కాకుండా ప్రేక్షకులపై తేనేటీగల దాడి ఇపుడు ఆశ్చర్యం కలిగించే విషయం. అకస్మాత్తుగా తేనేటీగలు దాడి చేయడంతో ప్రేక్షకులు గేలరీల్లోంచి పరుగులు తీశారు. హఠాత్తుగా ఈ సంఘటన జరగడంతో మ్యాచ్‌ని పదిహేను నిమిషాల పాటు నిలిపివేశారు.

ఆటగాళ్లు సేఫ్…

భారత్ ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మ్యాచ్ మొదలయ్యాక 28వ ఓవర్‌లో తేనేటీగలు దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తేనేటీగల దాడిలో ఆటగాళ్లకు ఏమీ కాలేదని..తేనేటీగలు మైదానంలోకి రాలేదని అధికారులు చెప్పారు. అవి కేవలం గ్యాలరీల్లోని ప్రేక్షకులపై మాత్రమే దాడి చేశాయని చెప్పారు.
bees stops cricket match
ఈ తేనేటీగల దాడి జరిగినపుడు భారత్-ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిద్ మైదానంలో నడుస్తున్నారని, తేనేటీగలను చూసి లోపలికి పరుగు తీశారని అధికారులు వెల్లడించారు. గేలరీల్లో గాయపడిన వారిని వెంతనే హాస్పిటల్‌కి తరలించామని తెలిపారు. ఈ ఘటన వల్ల ప్రేక్షకులను పశ్చిమం వైపు గ్యాలరీ నుంచి తూర్పువైపు గేలరీకి మార్చామని స్పష్టం చేశారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *