పాకిస్థాన్‌ను ఆటలోంచి తీసేయండి

పాకిస్థాన్‌ను ఆటలోంచి తీసేయండి
పాకిస్థాన్  ప్రభుత్వం పాటిస్తున్న నిర్ణయాల వల్ల ఆ దేశ క్రీడా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ…భారతదేశాన్ని ఇబ్బందులు గురిచేస్తున్న పాకిస్థాన్ అన్ని రకాలుగా ఒంటరిగా మిగిలే పరిస్థితికి వచ్చేస్తోంది. ఇపుడు తాజాగా క్రీడల్లో కూడా వెనుకబడే స్థితికి వచ్చేస్తోంది.
 
కశ్మీర్‌లో పుల్వామా దాడిని ఉద్దేశిస్తూ…ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ను నిషేధించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐసీసీని కోరింది. ఇప్పటికే ప్రపంచకప్ మ్యాచుల్లో బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా పావులను కదిపినట్టు సమాచారం. ఇంకో వారం రోజుల్లో జరగనున్న ఐసీసీ సమావేశం అయిన తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్ విషయం గురించి స్పష్టత ఇవ్వొచ్చు.
world cup 2019

క్రికెట్ ఎక్కువా..దేశం ఎక్కువా!

ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి ప్రపంచకప్ మొదలు అవబోతోంది. జూన్ 16న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే.. ఉగ్రవాదదాడిలో అమరులైన జవాన్లకి నివాళిగా పాకిస్థాన్ తో మ్యాచ్‌ను బహిష్కరించాలని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున బీసీసీఐను కోరుతున్నారు. ఒకవేళ భారత్ జట్టు… ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. అప్పుడు పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు ఇవ్వనున్నారు. అలాకాకుండా… మ్యాచ్‌నే ఆడాలనుకుంటే… బీసీసీఐకి దేశం కంటే క్రికెట్ ఎక్కువనే సంకేతాలు ప్రపంచానికి ఇచ్చినట్లవుతుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
 
‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై బీసీసీఐ పాలకుల కమిటీ వెంటనే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆదేశించినట్టైతే… అప్పుడు వేగంగా బోర్డు నిర్ణయాన్ని అమలు చేయడానికి వీలుంటుంది’ అని బీసీసీఐ సెక్రటరీ నిరంజన్ షా స్పష్టం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *