కెప్టెన్‌ నిర్ణయమే విండీస్‌ను ఓడించింది ... బ్రియాన్‌ లారా

కెప్టెన్‌ నిర్ణయమే విండీస్‌ను ఓడించింది ... బ్రియాన్‌ లారా

స్వదేశంలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 1-3 తేడాతో భారత్‌ విజయం సాధించింది. బలహీనమైన జట్టుతో వచ్చినా, విండీస్‌ గట్టిగానే పోరాడింది. నైతిక విజయాన్ని మూటకట్టుకుంది. ఒక సమయంలో టీం ఇండియాను భయపెట్టింది. సిరీస్‌ను సమం చేసే అవకాశాలాను చేజేతులారా నాశనం చేసుకుంది. అత్యంత బలహీనమైన జట్టుతో వచ్చి, అద్భుత ప్రదర్శనను కనబరిచింది. విండీస్‌ ఈ సిరీస్‌ కోల్పోవడానికి కెప్టెన్‌ తీసుకున్న ఒక నిర్ణయమే కారణమని లారా అభిప్రాయపడ్డాడు.

అలా వచ్చారు… పోరాడారు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విండీస్‌ను బలహీనమైన జట్టు అనే చెప్పుకోవాలి. టీం ఇండియాతో పోల్చుకుంటే ఆ బలహీనత మరికాస్త ఎక్కువే అని చెప్పాలి. అయినా సరే, విండీస్‌ విరోచిత పోరాటం చేసింది. మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఒక విజయం సాధించి, మరో మ్యాచ్‌ను టై చేసుకుంది. మిగతా రెండు మ్యాచ్‌లలో ఇండియా విజయం సాధించింది. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ విజయం విండీస్‌ సాధించి ఉంటే… సిరీస్‌ సమం అయి ఉండేది. అలా జరగకపోవడానికి విండీస్‌ కెప్టెన్‌ తీసుకున్న నిర్ణయమే కారణమని లారా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.

brian lara comments

అదేకారణం…

ఐదో మ్యాచ్‌కు ముందు వరకూ విండీస్‌ అభిమానులు ఆశగా ఎదురుచూశారు. తమ జట్టు ఐదో మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌ను సమం చేస్తుందని కలలు కన్నారు. కానీ అవన్నీ ఆవిరయ్యాయి. టీం సమిష్టిగా రాణించడంతో, 9 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయాన్ని సాధించింది. చివరి వన్డే కేరళలోని తిరువనంతపురంలో గురువారం సాయంత్రం జరిగింది. టాస్‌ గెలిచిన విండీస్‌ కెప్టెన్ జేసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, భారీ స్కోర్‌ను ఇవ్వాలనే తొందరలో బ్యాట్స్‌మెన్స్‌ అంతా క్యూ కట్టారు. టాస్ గెలిచిన హోల్డర్‌ బౌలింగ్‌ను ఎంచుకుని ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేదని లారా అన్నాడు.

అలా అన్నాడు…

‘తిరువనంతపురం పిచ్ డ్రైగా ఉంది. డ్రై పిచ్‌ల మీద టాస్‌ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకోవాలి. ఈ పిచ్‌లు తొలుత బౌలింగ్‌కు సహకరిస్తాయి. హోల్డర్‌ బ్యాటింగ్‌ను ఎంచుకోవడంతో… అది భారత్‌కు కలిసొచ్చింది. హోల్డర్‌ తీసుకున్న నిర్ణయం భారీ మూళ్యం చెల్లించుకునేలా చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *