కటకటాల్లోకి కీచకులు

కటకటాల్లోకి కీచకులు

RGUKT లో కీచక ప్రొఫెసr ఒక్కరూ కాదు ముగ్గురు రవి వరాలతో పాటు మరో ఇద్దరు విశ్వనాథ్ ,సుదాకర్ అరెస్ట్.నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి అరెస్ట్.ఎస్పీ శశిధర్ రాజు.నిర్భయ ఫోక్స్ చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వరాలపై నిర్భయ ఫోక్స్ చట్టాల ప్రకారం, డబ్బులు తీసుకొని పేపర్ లీక్ చేసిన వ్యవహారంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధాకర్, రివల్యూషన్ ఇంచార్జ్ విశ్వనాధ్లను బుదవారం అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎస్పి శశిధర్ రాజు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న విద్యార్థులపై కీచక ప్రొఫెసర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై యూనివర్సిటీ అధికారుల కంప్టైంట్ ప్రకారం నిందితుడు ప్రొఫెసర్ రవి వరాలను బుధవారం హైదరాబాద్, బండ్లగూడ లోని తమ బంధువుల ఇంట్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఉన్నత చదువులు చదివిన తాను మామూలు విద్యార్హతలున్న ప్రొఫెసర్ లతో సమానంగా జీతభత్యాలు అందుకోవడం సహించలేక విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకొని పాస్ చేయిస్తానని చెప్పి బాబు 3 నుంచి 4 లక్షల వరకు సంపాదించాడని ఈ వ్యవహారంలో ప్రొఫెసర్ రవి వరాల తో పాటు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధాకర్, రివల్యూషన్ ఇంచార్జ్ విశ్వనాధ్లను భాగస్వాములను చేస్తూ తలా కొంత ఇచ్చేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఎగ్జామ్ పేపర్లను ప్రొఫెసర్ సుధాకర్ వద్ద నుండి తీసుకొని రవి వరాల తన ఇంటి వద్ద రెమిడియల్( సప్లిమెంటరి) వ్రాసే విద్యార్థినీలకు పరీక్షలు రాయించే వాడని తెలిపారు. ఈ క్రమంలోనే పరిచయమైన విద్యార్థినిలకు అసభ్యకరమైన సందేశాలు పంపడంతో కొందరువిద్యార్థులు మొబైల్స్లో బ్లాక్ సైతం చేశారని తెలిపారు. బ్లాక్ చేసిన విద్యార్థినీలను వారినిబెదిరించి లొంగదీసుకోవాలని చూసేవాడిని తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *