బండ్లన్నా... నువ్వే కావాలి

బండ్లన్నా... నువ్వే కావాలి

ఎన్నికల సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అంచనాలను తలదన్నే మంత్రమేదో ఎన్నికల్లో ఉంది. ఒకసారి ఎన్నికల సైరన్‌ మోగిందా… ఇక అందరి ఆలోచనలూ దాని చూట్టూతా తిరుగుతాయి. నమ్ముకున్న పార్టీ కోసం పనులన్నీ పక్కన పెట్టి ప్రచారానికి దిగే సామాన్య కార్యకర్తలుంటారు. సీట్లు రానందుకు కండువాలు మార్చే నాయకులూ ఉంటారు. రోజురోజుకూ ఎలక్షన్ల వేడిని పెంచే వాతావరణం ఉంటుంది. ఫ్లాష్‌ న్యూస్‌ల వర్షమూ ఉంటుంది. వీటిలో షాక్‌ ఇచ్చే వార్తలుంటాయి. ఆలోచింపచేసే విషయాలుంటాయి. ప్రచారమంత్రాలుంటాయి. వీటితో పాటే ఫేక్‌ వార్తలూ చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని వార్తలైతే… అలా వినీవినగానే భలే నవ్వు తెప్పిస్తాయి. ఇది సరిగ్గా అలాంటి వార్తే… సోషల్ మీడియాలో తనకంటూ స్పెషల్‌ క్రేజ్‌ ఉన్న బండ్ల గణేష్‌ పేరు సీమాంధ్ర రాజకీయాల్లో గట్టిగా వినపడుతోంది. దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

బండ్లన్నా… నువ్వే కావాలి…

తనకున్న పరిచయాలు అలాంటివీ ఇలాంటివీ కావనీ… అన్నేసి పరిచయాలు ఇంకెవరికీ లేవనీ… తనకు అంతమందితో సాన్నిహిత్యం ఉందని తెలిస్తే షాక్‌ అయిపోతారనీ… ఆమెరికా ప్రెసిడెండ్ ట్రంప్‌ తనకు బాగా క్లోజ్‌ అనీ… ఇలా తన గురించి మహబాగా ప్రచారం చేసుకునే బండ్లన్న పేరు ఇప్పుడు సీమాంధ్ర రాజకీయాల్లో వినబడుతోంది. బండ్ల గణేష్ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నా టీడీపీ, వైసీపీలు వదలడం లేదట. తమ పార్టీ తరపున ప్రచారం చేయించుకునేందుకు ఆ రెండూ ప్రధానపార్టీలు కూతహలంగా ఉన్నాయనే వదంతులు వినిపిస్తున్నాయి. ఏకంగా ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు, జగన్‌లో నేరుగా బండ్లన్నని సంప్రదిస్తున్నారనీ, వందలు కోట్లు సమర్పించుకుంటానికైనా సిద్ధమంటున్నారనీ… బండ్లన్న క్రేజ్‌ అంటే ఇదీ అని అతని అభిమానులు సోషల్ మీడియాలో సందండి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ వార్తలను వైసీపీ, టీడీపీల నాయకులూ, కార్యకర్తలూ పూర్తిగా కొట్టిపడేస్తున్నారు. ఇవన్నీ బండ్ల గణేష్‌ను ట్రోల్‌ చేసేందుకు పుట్టుకొచ్చిన వార్తలేనని తేల్చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *