ఇద్దరు హీరోయిన్స్ తో బాలయ్య !!

ఇద్దరు హీరోయిన్స్ తో బాలయ్య !!

బాలయ్య, తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కాబోయే ఈ చిత్రంలో బాలయ్య జోడీగా ఇద్దరు భామలు నటించబోతున్నారట. మరి బాలయ్య సరసన నటించబోతున్న ఆ ఇద్దరు బ్యూటీస్‌ ఎవరో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ…

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం రూలర్.ఇందులో బాలయ్య ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు.ఈ మూవీలో బాలయ్యకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని టాక్.rx 100 ఫేం పాయిల్ రాజ్ పుత్ మెహ్రీన్ కౌర్ పిర్జాడ హీరోయిన్‌గా ఫైనల్ చేశారని సమాచారం.త్వరలోనే ఈ సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నారు.

అయితే గతంతో బాలయ్య ఇద్దరు హీరోయిన్స్‌తో నటించిన సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి.ఇప్పుడు ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రటీమ్.అయితే బాలకృష్ణ ఈ ఇద్దరితో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేదానిపై నందమూరి అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *