బయ్యర్లకు ఫ్రీగా మహానాయకుడు

బయ్యర్లకు ఫ్రీగా మహానాయకుడు

ఎన్టీఆర్‌ బయోపిక్‌- కథానాయకుడు సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువే నష్టాలను మూటగట్టుకుంది. . 72 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మితే ఫుల్ రన్‌లో కేవలం 23 కోట్లు మాత్రమే వసూలు చేసి.. దాదాపు 50 కోట్లు నష్టాలు తీసుకొచ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘క‌థానాయ‌కుడు’ క‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డేయటానికి బాలయ్యే ముందుకొచ్చాడు. ఈ మేరకు ఆయన ఓ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

మ‌హానాయ‌కుడు సినిమాను బ‌య్యర్లకు ఫ్రీగా ఇచ్చేస్తున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో వాటా తీసుకోవాల‌నేది నిర్మాత‌ల‌కు, బ‌య్యర్లకు మ‌ధ్య ఒప్పందంలా క‌నిపిస్తుంది. దీనికి క్రిష్ కూడా ఒప్పుకున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఈ చిత్రం బ‌డ్జెట్ ప‌రంగా చూసుకుంటే తొలి భాగానికే బాల‌య్యకు లాభాలు వ‌చ్చేసాయి. దాదాపు 120 కోట్ల వ‌ర‌కు తొలి భాగం ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. దాంతో ఇప్పుడు రెండో భాగాన్ని ఫ్రీగా ఇచ్చేయాల‌ని చూస్తున్నాడు బాల‌య్య‌.

mahanayakudu release date

ఒక‌వేళ ఇదే కానీ నిజ‌మైందంటే క‌చ్చితంగా బాల‌య్య నిర్ణయం సంచ‌ల‌నంగా మారుతుంది.ఫిబ్రవ‌రిలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అయితే రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *