ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

ఎన్టీఆర్ జీవిత చరిత్రని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. ఈ సినిమాలో ప్రముఖల పాత్రలకిచాలా మళ్లీ ప్రముఖ నటీనటులను  సెలక్ట్ చేసి నిన్న మొన్నటి వరకూ   ఈ ప్రేజియస్ సినిమా గురించి నందమూరి అభిమానులకు తెలుగు ప్రేక్షకులలకు చాలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు దర్శక, నిర్మాతలు. ఎన్టీఆర్ జీవితంలో అనేక అద్భుత సన్నివేశాలు, సంఘటనలకు కొదవే లేదు.దీంతో ఇప్పుడు సినీ లవర్స్  దృష్టంతా సినిమా ఎలా  ఉండబోతుంది. అవన్నీ డైరెక్టర్ క్రిష్ ఎలా  చిత్రీకరించాడో అని ఉత్కంఠ నెలకొంది.అయితే  అందరి ఆసక్తికి తగ్గట్టే హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్ సినిమాకు క్రేజ్ తెచ్చే ఏ అంశమూ  కూడా వదలిపెట్టాలేదట.కీరవాణి  సంగీతం ఈ సినిమాకి  హైలైట్‌ కాబోతుందని టాక్…

చంద్రబాబు నాయుడు

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.అందుకే  ఈ సినిమా ఆడియో వేడుకను కూడా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. డిసెంబర్ 16న తిరుపతిలో ఆడియో వేడుకను నిర్వహించబోతున్నారు.అందుకు సంబంధింని అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ ఆడియో వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టుగా సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం..

రికార్డు స్థాయిలో…

ఎన్టీఆర్  రెండో  భాగం మహానాయకుడు జనవరి 24న రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసేందుకు  రిలీజ్ చేయబోతున్నారు..చాలా ప్రేస్టేజియస్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్  రికార్డు స్థాయిలో  చేస్తున్నట్లు సమాచారం. వంద కోట్ల బిజినెస్ ఇప్పటికే ఈ చిత్రం చేసినట్లుగా  టాలీవుడ్ వర్గాల టాక్. మొత్తానికి    భారీ అంచనాలతో రాబోతున్న ఈ ఎన్టీఆర్ బయోపిక్ ఎలాంటి చరిత్ర సృష్టిస్తాయో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *