అదరగొడుతున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్స్‌!

అదరగొడుతున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్స్‌!

ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. వరల్డ్ వైడ్‌గా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ ఇండయాన్ బాక్సాఫీస్ వద్ద డబుల్‌ సెంచరీ కొట్టింది. అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ టైటిల్‌లో ఎండ్‌ అనే పదం ఉందేమో గానీ… ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఈ చిత్రానికి ఇప్పట్లో ఎండ్‌కార్డు పడేలా లేదు. మరి ఇప్పవరకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం…

అవెంజర్స్ ఎండ్ గేమ్..ప్రస్తుతం సినీ అభిమానులందరి నోటా వినిపిస్తున్న మాట. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ సునామీ సృష్టిస్తున్న అవెంజర్స్‌ ఇండియాలోనూ ఇరగదీస్తున్నారు. అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ టైటిల్‌లో ఎండ్‌అనే పదం ఉందేమో గానీ… ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఈ చిత్రానికి ఇప్పట్లో ఎండ్‌కార్డు పడేలా లేదు.ఇండియాలో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా చరిత్ర సృష్టించిన అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ ఫస్ట్ వీక్‌లోనే 158.65 కోట్లు వసూలు చేసింది. విడుదలైన ఐదు రోజుల్లో వసూళ్ళల్లో డబుల్‌ సెంచరీ కొట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

తొలి వారంలో హిందీ హిట్‌ సినిమాలు దంగల్‌ 197.54 కోట్లు, టైగర్‌ జిందా హై 206.04 కోట్లు, సంజు 202.51 కోట్లు వసూలు చేశాయి. వాటిని అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ ఐదు రోజుల్లో దాటేసింది. బాహుబలి 2ని ఎప్పుడు దాటుతుందా అని ట్రేడ్‌ పండితులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 హిందీ వెర్షన్‌ తొలి వారంలో 247 కోట్లు వసూలు చేసింది. అవెంజర్స్‌ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ లెక్కల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. పలు దేశాల్లో వసూళ్ళ రికార్డులను తిరగరాస్తోంది. కొన్ని దేశాల్లో బుధవారం, మరికొన్ని దేశాల్లో శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే సుమారు 8,400 కోట్లు వసూలు చేసి, అతి తక్కువ టైంలో ఘనత సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 10 వేల కోట్ల క్లబ్‌లో చేరుతుంది. అవెంజర్స్‌ దూకుడు చూస్తుంటే… త్వరలో అవెంజర్స్‌ సిరీస్‌లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా ఇప్పటి వరకూ తొలి స్థానంఅవెంజర్స్ ఎండ్ గేమ్..ప్రస్తుతం సినీ అభిమానులందరి నోటా వినిపిస్తున్న మాట. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ సునామీ సృష్టిస్తున్న అవెంజర్స్‌ ఇండియాలోనూ ఇరగదీస్తున్నారు.లో ఉన్న అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌ రెండో స్థానంలోకి వచ్చేస్తుందనిపిస్తుంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *