అవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ రికార్డుని బద్దలు కొడుతుందా ?

అవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ రికార్డుని బద్దలు  కొడుతుందా ?

ఏప్రిల్ 26న వేసవి సేలవులని టార్గెట్ చేస్తూ భారీఅంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా విడుదలైన అవెంజర్స్ ధి ఎండ్ గేమ్.. విడుదలై అప్పుడే 10 రోజులు దాటింది. భారీ క్రేజ్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం రిలీజైన నాలుగు రోజుల వరకు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ క్రేజ్ చూసిన ఎవరైనా అవెంజర్స్ ఎండ్ గేమ్ 2000 కోట్లు కళ్లగొట్టడం ఖాయమనే అన్నారు. తాజాగా అవతార్ రికార్డులకు చెక్ పెట్టాలని ఎండ్ గేమ్ కంకణం కట్టుకుంది. తెలుగు, బాలీవుడ్, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ అవెంజర్స్ ఎండ్ గేమ్ హవా మాములుగా రాలేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ కి భయపడి చాలామంది స్టార్లు తమ సినిమాలను దాదాపుగా నెలరోజుల పాటు వాయిదా వేసుకున్నారు.

ఈ చిత్రం ఇప్పటి వరకు 12,590 కోట్లను వసూలు చేసింది. ఈ వీకెండ్ ని లో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే అవతార్ తర్వాత వరుసలో ఉన్న స్టార్ వార్స్ ని దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 19,321 కోట్లను వసూలు చేసి అవతార్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా దాని తర్వాతి స్థానంలో స్టార్ వార్ ఉంది. ఈ మూవీ సాధిస్తున్న కలెక్షన్స్ బట్టి చూస్తే స్టార్ వార్స్ రికార్డును అవెంజర్స్ ఎండ్ గేమ్ అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు ట్రెండ్ వర్గాలు. ఈ పది రోజుల్లో ఇండియా వైడ్ గా ఈ చిత్రం 300 కోట్లు కొల్లగొట్టి.. 400 కోట్ల క్లబ్బులో చేరేందుకు పరుగులు పెడుతుంది. ఇక తెలుగులో పెద్ద సినిమాలు ఏవి కూడా లేవు. మహేష్ బాబు నటించిన మహర్షి రిలీజ్ వరకు అవెంజర్స్ కలెక్షన్స్‌కు ఢోకా లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *