చివరి వరకూ పోరాడాం... ఆఖరున చేతులెత్తేశాం

చివరి వరకూ పోరాడాం... ఆఖరున చేతులెత్తేశాం

రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తూ, సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీం ఇండియాపైనే ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ కళ్లన్నీ ఉన్నాయి. ఆసీస్‌ గడ్డ మీద కంగారూలను ఎలా ఎదుర్కొంటుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. హోమ్‌పిచ్‌ల మీదే భారత్‌ ఫామ్‌లో ఉంటుందని ట్రోల్‌ చేస్తున్న వారికి, సమాధానం చెప్పేందుకు అన్ని విధాలా సిద్ధమై టీం ఇండియా బయల్దేరింది. తమగడ్డపై తమని ఓడించడం భారత్‌కు సులభమేమీ కాదనీ, తమ బౌలర్లు ముచ్చెమటలు పట్టిస్తారని… సిరీస్‌కు ముందే స్టీవా వ్యాఖ్యలు చేశాడు. విదేశీ పిచ్‌ల పైనా నిరూపించుకోవాల్సిన సందర్భంలో… టీం ఇండియా ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టింది. మొదటి టీ20లో పోరాడి ఓడింది.

Ind Vs Aus 1st T20 highlights

అదరగొట్టారు…

టాస్‌ గెలిచిన టీం ఇండియా బౌలింగ్‌ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌, తొలుత తడబడ్డట్టు కనిపించినా ఆ తర్వాత పుంజుకుంది. ప్రమాదకరంగా మారబోతున్న ఫించ్‌ను ఖలీల్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రిస్‌లిన్‌ రెచ్చిపోయి ఆడాడు. ఒక్కసారిగా భారత్‌ బౌలర్ల మీద ఒత్తిడి పెంచాడు. ఖలీల్ వేసిన ఎనిమిదవ ఓవర్‌లో ఎనిమిదవ ఓవర్లో క్రిస్‌లిన్‌ మూడు సిక్సర్లు బాది, స్కోరువేగాన్ని అమాంతంగా పెంచాడు. తనదైన శైలిలో విరుచుకుపడుతున్న లిన్‌ను కులదీప్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపాడు. భారత్‌ బౌలర్లు ఊపిరిపీల్చుకునే లోపే, మాక్స్‌వెల్, స్టోనిస్‌లు విరుచుకుపడ్డారు. స్కోర్ స్పీడ్‌గా పరిగెడుతున్న సమయంలో వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో 17 ఓవర్లకు 158 పరుగుల వద్ద ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. డక్‌వర్త్‌లుయీస్‌ పద్ధతి ప్రకారం భారత్ టార్గెట్‌ను 17 ఓవర్లకు 174 పరుగులుగా నిర్దేశించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో… ఓపెనర్ డి ఆర్కీ షార్ట్‌ 7 పరుగులూ(12 బంతులు), ఫించ్‌ 27 పరుగులూ (24 బంతులు), క్రిస్‌లిన్‌ 37 పరుగులూ (20 బంతులు), మాక్స్‌వెల్‌ 46 పరుగులూ (24 బంతులు), స్టోనిస్‌ 33 పరుగులూ (19 బంతులు) సాధించారు. మూడు ఓవర్లు వేసిన భువనేశ్వర్‌ 15 పరుగులిచ్చాడు. మూడు ఓవర్లు వేసిన బూమ్రా 21 పరుగులిచ్చి, ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఖలీల్‌ మూడు ఓవర్లు వేసి, 42 పరుగులిచ్చి, వికెట్ తీసుకున్నాడు. కులదీప్‌ యాదవ్‌ నాలుగు ఓవర్లు వేసి, 24 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన కుర్నల్‌ పాండ్యా 55 పరుగులిచ్చాడు.

పోరాడి… ఓడాం…

డక్‌వర్త్‌లుయీస్‌ పద్ధతి ప్రకారం టీం ఇండియా టార్గ్‌ట్‌ను 174 పరుగులుగా నిర్దేశించారు. భారీ టార్గెట్‌తీ బరిలోకి దిగిన భారత్‌ రోహిత్‌ వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఆ వెంటనే వచ్చిన రాహుల్‌, కోహ్లీలూ వెంటనే పెవిలయన్‌ బాట పట్టారు. మరోవైపు నుంచీ తనదైన శైలిలో విరుచుకుపడుతున్న ధావన్‌ భారత్‌ ఆశలను సజీవంగా ఉంచాడు. బౌండరీలతో రెచ్చిపోయాడు. ధావన్‌ ఔటయ్యాక, స్కోర్ నెమ్మదించింది. విజయం భారత్‌కు బాగా దూరమవుతోన్న తరుణంలో పాంట్‌, కార్తీక్‌లు రెచ్చిపోయారు. 14 వ ఓవర్లో 25 పరుగులు సాధించి, మళ్లీ ఆశలు రెకేత్తించారు. ఆ తర్వాత ఓవర్లోనూ 11 పరుగులు సాధించారు. విజయం ఖాయమనుకున్న సమయంలో 16 వ ఓవర్లో పాంట్‌ అవుటయ్యాడు. పాంట్‌ అవుటైన ఓవర్లోనూ చివరి బంతిని బౌండరీకి తరలించిన కార్తీక్‌ గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సొచ్చింది. ఆ సమయంలో కార్తీక్‌, పాండ్యాలు చేతులెత్తేశారు. భారత్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ 7 పరుగులూ( 8 బంతులు) ధావన్‌ 76 పరుగులూ( 42 బంతులు), కోహ్లీ4 పరుగులూ (బంతులు), రాహుల్‌ 13 పరుగులు(12 బంతులు), పాంట్‌ 20 (15 బంతులు ),కార్తీక్‌ 30పరుగులు(13 బంతులు,) కులదీప్‌ యాదవ్‌ 4 పరుగులు(ఒక బంతి), భువనేశ్వర్‌ 1 పరుగూ (ఒక బంతి) సాధించారు.

చివరివరకూ నిలబడ్డాం…

విదేశీ పిచ్‌లపై చేతులెత్తేస్తామన్న విమర్శలతో ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టిన టీం ఇండియా దాదాపు విజయం అంచువరకూ చేరుకుంది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్‌ లోనూ ఒక మోస్తరుగా రాణించి, ఆసీస్‌ను వణికించింది. మరుసటి మ్యాచ్‌లలో గెలసుస్తామన్న భరోసానూ ఇచ్చింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *