వనస్థలిపురంలో భారీ దోపిడీ

వనస్థలిపురంలో భారీ దోపిడీ

హైదరాబాద్‌ వనస్థలిపురంలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎం సెంటర్‌లో డబ్బులు వేసేందుకు వచ్చిన వ్యాన్‌ సిబ్బంది దృష్టి మరల్చి 70 లక్షలు దోచుకెళ్లారు దొంగలు. యాక్సిస్‌ ఏటీఎంలో సెంటర్‌లో డబ్బులు నింపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనపై ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ.. అటెన్షన్‌ డైవెర్షన్‌తో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిదిలో భారో చోరీ జరిగిందన్నారు. పనామా వద్ద యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు జమ చేయడానికి నలుగురు సిబ్బంది వచ్చారని తెలిపారు. వాహనంలో నుంచి డబ్బులు తీసుకెళ్లి జమ చేస్తుండగా.. దుండగులు దృష్టి మళ్లించి డబ్బులు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లారన్నారు. పెట్టెలో దాదాపు 58లక్షలు వరకు ఉండొచ్చన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *