అర్ధరాత్రి ఇవి తింటే అంతే సంగతులు

అర్ధరాత్రి ఇవి తింటే అంతే సంగతులు

చాలామందికి చాలా అలావాట్లు ఉంటాయి.కొన్నికొన్నిసార్లు అలవాట్లే వాళ్లకో ప్రత్యేకమైన గుర్తుంపునీ తెచ్చిపెడతాయి.అయితే వీటిలో చాలావరకూ అనారోగ్యాన్ని కలగజేసేవే ఉంటాయి.గుర్తుంపు తెచ్చిపెట్టడం వరకూ,క్రేజీగా అనిపించడం వరకూ ఓకే కానీ…అంతకు మించి అది ఆరోగ్యం మీద ప్రభావం చూపేంత వరకూ వస్తే తప్పక ఇబ్బందులు పడాల్సిందే.ముందుతరంతో పోల్చుకుంటే ఈతరం యువతకు ఆహారపు అలావాట్లలో చాలా మార్పులొచ్చాయి.ఈ తంతు ప్రతితరంలోని మార్పుల్లోనూ ఉన్నా…ముందు తరానికీ,ప్రస్తుతమున్న తరానికీ ఉన్న తేడా ఇప్పటివరకూ ఉన్న వ్యత్యాసాలన్నింటిలోనూ పెద్దది.అదేలా చిక్కులనూ తెచ్చిపడేస్తుంది.ఈ జాబితాలోకే పిజ్జా కూడా చేరుతుంది.వీటిలోని కొవ్వుల శాతం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.రాత్రంతా శరీరం విశ్రాంతిలో ఉంటుంది కాబట్టి పగటి సమయం కంటే రాత్రుల్లో ఇవి తీసుకోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొత్తతరం తిప్పలు…

ఈ తరం అర్ధరాత్రి చిరుతిండికి బాగా అలవాటు పడిపోయింది.సమయంతో పనిలేకుండా అర్ధరాత్రనే పట్టింపులేకుండా…అంతో జంక్‌ఫుడ్డో,ఇంత ఐస్‌క్రీమో కడుపులో పడాల్సిందే. ఆహారనియమాలన్నీ గాల్లో కలిసిపోతున్నాయి.ఇలా ఏ నెలకోసారో అయితే పర్వాలేదు కానీ ఇదే తంతు రోజూ కానసాగితే చేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్టే అవుతుంది.రాత్రుల్లో ఏ అహారపదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందో…హెల్త్ నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు.వాటిపై ఓ లుక్కేద్దాం పదండి.రాత్రివేళల్లో ఐస్‌క్రీమ్‌ను తినడానికి ఆసక్తి చూపేవాళ్లు బోలెడంత మంది ఉంటారు.వీరంతా చేజేతులారా జీర్ణసమస్యలను కొనితెచ్చున్నట్టే అవుతుంది.రాత్రిసమయాల్లో వీటికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.వీటితో పాటుగా చాక్లెట్లకూ,కూల్‌డ్రింక్స్‌కూ,వేయించిన చిప్స్‌ వంటి వాటికీ తప్పనిసరిగా చెక్‌ పెట్టాల్సిందే.కాదని వీటి జోలికి వెళ్తే వాటితో పాటుగా శరీరంలోకి అనారోగ్యాన్నీ కొని తెచ్చుకున్నట్టే అని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *