రికార్డులతో రికార్డు సృష్టించిన ఆశ్రిత ఫర్మాన్‌

రికార్డులతో రికార్డు సృష్టించిన ఆశ్రిత ఫర్మాన్‌

ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల ఉంటుంది. అయితే కొంత మందే అనుకున్న వాటిని సాధించగలరు. ఒక పెద్దాయన మాత్రం ఏకంగా 226 గిన్నిస్‌ రికార్డులు సొంతం చేసుకున్నారు.

ఇతని పేరే ఆశ్రిత ఫర్మాన్‌. అమ్మో 226 అన్ని గిన్నిస్‌ రికార్డులా..అని అనుకుంటున్నారా! నిజమే సాధించి చూపించారు. రికార్డులు సృష్టించటం, అనుకున్నది సాధించటం తనకు చాలా ఇష్టమంటాడు ఫర్మాన్‌.

చిన్నప్పటి నుంచి ఒక్క గిన్నిస్‌ రికార్డు అయినా సాధించాలని అనుకునే వాడట. అయితే …శారీరకంగా అంతగా దృఢంగా ఉండకపోవడంతో అది సాధ్యం కాదని భావించేవాడట. కానీ.. 1978లో ఓ స్వామి ఇచ్చిన ధైర్యంతో తొలిసారిగా అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన 24 గంటల సైకిల్‌ రేసులో పాల్గొన్నాడు. ఈ రేస్‌లో ఫర్మాన్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ మరుసటి ఏడాదే 27 వేల జంపింగ్‌ జాక్స్‌ చేసి తొలి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. అప్పటినుంచి వెనక్కి చూసుకోలేదు. ఎప్పుడూ వినూత్నమైన ఫీట్లు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా దాదాపు 600 గిన్నిస్‌ రికార్డులను సాధించారు.

ప్రస్తుతం ఫర్మాన్‌ దగ్గర 226 గిన్నిస్‌ రికార్డుల సర్టిఫికెట్లు ఉన్నాయి. అంటే వాటిని ఇంకా ఎవరూ అధిగమించలేదన్న మాట. తాజాగా ఒక్క నిమిషంలో 26 పుచ్చకాయలను తన ఉదరంపై పెట్టుకుని పగులగొట్టుకున్నాడు. ఇది కూడా రికార్డులో కెక్కింది. కంగారూ బంతిపై గెంతుకుంటూ ఎక్కువ దూరం వెళ్లడం.. పెద్ద బంతిపై ఎక్కువ సేపు నిలబడటం.. నీటిలో చిన్న బంతులను ఎగరేసి పట్టుకోవడం.. నీటిలోపల ఎక్సర్‌సైజ్‌ చేయడం.. నీటిలోపల సైకిల్‌ తొక్కడం ఇలా తనకు ఏది అనిపిస్తే దాన్ని కొద్ది రోజుల్లోనే నేర్చుకోవడం గిన్నిస్‌ రికార్డుల్లో తన పేరు రాసుకోవడం.. తన జీవితం మొత్తం ఇలా రికార్డులు సాధిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.

వయస్సుతో సంబధం లేకుండా..ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా…సహాసం చేయడం వల్ల ఏదైనా సాధించవచ్చని మరో సారి కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకోవడం ఓ గొప్ప ఆలోచనేగా..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *