ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగని దాడులు

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగని దాడులు

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగడాలకు సంబంధించిన మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి ఓ పాత్రికేయుడిపై అమానుషంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రైలులో అనధికారిక వ్యాపారులపై కథనాన్ని ప్రచురించినందుకు రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రాకేష్ కుమార్ జర్నలిస్టు అమిత్‌శర్మపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. దీనికి సంబంధిచిన వీడియో వైరల్‌ కావడంతో అధికారిపై విమర‍్శలు వెల్లువెత్తాయి.

తనను దారుణంగా కొట్టి, కెమెరాను ధ్వంసం చేశారని జర్నలిస్టు వాపోయారు. అంతేకాదు లాకప్‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారని ఆరోపించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *