బాలిక మానసిక స్థితిని ఆసరా చేసుకుని ఆర్మీ ఉద్యోగి చేసిన దారుణం

బాలిక మానసిక స్థితిని ఆసరా చేసుకుని ఆర్మీ ఉద్యోగి చేసిన దారుణం

కాలం గడిచేకొద్దీ కొందరు మగవాళ్లలో విచక్షణ అనేది లేకుండా పోతోంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న అత్యాచారాలను చూస్తే విచక్షణ అనే కంటే వారు మనుషులం అనే విషయమే మరిచిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లలపై కనికరం లేకుండా దాడి చేసో, మాయ చేసో వారిని లొంగదీసుకుని కామాన్ని తీర్చుకుంటున్నారు. ఆడపిల్లల మీద అత్యాచారాలకు పాల్పడే వారి విషయంలో మన చట్టాలు ఇంకా కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఈ దుర్మార్గాలు ఆగేలా లేవు. ఇలాంటి ఘటనలన్నీ రోజూవారి వార్తల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటివి జరగకుండా అడ్డుకునే పరిష్కారమో, కొత్త వ్యవస్థో రావాల్సిన అవసరం ఉందని గట్టిగా చెప్పొచ్చు.

ఆర్మీ ఉద్యోగి దారుణం

మాజీ ఆర్మీ ఉద్యోగి నిర్వాకం!

దేశానికి కాపలా ఉండి రక్షించే ఆర్మీ అధికారే ఓ బాలికను మాయమాటలతో నమ్మించి అత్యాచారం చేయడం ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ బాలికకు మద్యం తాగించి ఆమెపై ఏకంగా తొమ్మిది మంది కలిసి అత్యాచారం చేయడం అనే విషయం…సమాజాన్ని మనిషి ఎంత పాశవికంగా మారుస్తున్నాడో అనిపిస్తుంది. ఒక భావోద్వేగాన్ని అదుపు చేసుకోవడం రాని మనుషులు ఇంకా మనమధ్యే ఉన్నారంటే ఎంత చీదరగా ఉంటుంది. ఈ దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక(17) ఇంటర్ చదువుతోంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న బాలికను మాజీ సైనిక ఉద్యోగి సురేంద్ర పాశవికంగా మరో ఎనిమిది మందితో కలిసి అత్యాచారం చేశాడు. ఆ బాలికమీద కన్నుపడిన ఈ మాజీ సైనికుడు ఆమెకున్న మానసిక లోపాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలతో మభ్యపెట్టాడు. బాలికను ఇంటికి పిలుచుకెళ్లి మద్యం అలవాటు చేశాడు. వారం క్రితం తన పుట్టినరోజు ఉందని అబద్దం చెప్పి, ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులోకి జారుకున్న ఆ బాలికను, మరో ఎనిమిది మందితో కలిసి అత్యాచారం చేశాడు.

మౌనంగా మారిపోయిన బాలిక…

ఇది జరిగిన తర్వాత బాలిక రోజూ ఒంటరిగా ఉంటూ, ముభావంగా ప్రవర్తించేది. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. కృంగిపోయిన ఆ తల్లిదండ్రులు ఆదివారం రోజున పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఐ శ్రీరామ్ కేసు దర్యాప్తు కోసం ఆదేశించారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలిక చదువుతున్న కాలేజీ విద్యార్థి కూడా ఉన్నట్టు తెలిపారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని సీఐ చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *