'అర్జున్ రెడ్డి' త‌మిళ్ రీమేక్ 'ఆదిత్య వ‌ర్మ' టీజ‌ర్ ...

'అర్జున్ రెడ్డి' త‌మిళ్ రీమేక్ 'ఆదిత్య వ‌ర్మ' టీజ‌ర్ ...

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన న్సేష‌న‌ల్ మూవీ అర్జున్ రెడ్డి చిత్రం త‌మిళం, హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తమిళ్‌లో ఆదిత్యవర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు చిత్రటీమ్. ఆ టీజర్‌పై మీరు ఓ లుక్కెయండి..అర్జున్ రెడ్డి సినిమా హిందీలో, తమిళ్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో షాహిద్ క‌పూర్ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా,కోలీవుడ్‌లో తమిళ స్టార్ హీరో విక్ర‌మ్ కొడుకు ధృవ్ హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు.. ముందు ఈ సినిమాకు వర్మ టైటిల్‌తో రీమేక్ చేసినా..తర్వాత కొన్ని కారణాల వల్ల టైటిల్‌ను ఆదిత్య వర్మగా మార్చారు. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌కు ఈ రీమేక్‌కు చాలా తేడా ఉండడంతో నిర్మాతలు సినిమాను రీ షూట్‌ చేశారు. దర్శకుడు బాలా ఈ సినిమాను నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతల్ని సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో త‌మిళ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నాడు. తాజా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రటీమ్. టీజర్‌లో ధృవ్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. త‌మిళ నేటివిటీకి అనుగ‌ణంగా కొంత మార్చిన‌ట్టు తెలుస్తుంది. ధృవ్‌కు జోడీగా బనితా సంధు నటిస్తోంది. అయితే అర్జున్ రెడ్డి సినిమాను ఏ మాత్రం చెడగొట్టకుండా మక్కీకి మక్కీగా దించేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు టీజర్‌ చూస్తే తెలిసిపోతుంది. మరి దృవ్‌ కెరీర్‌కు ఈ రీమేక్ చిత్రం ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *