ఇండియాలో భారీగా తగ్గనున్న ఐఫోన్‌ ధరలు

ఇండియాలో భారీగా తగ్గనున్న ఐఫోన్‌ ధరలు
స్మార్ట్‌ ఫోన్‌ ప్రభావం ఎంతలా పెరిగిపోయిందో… ఆయా కంపెనీల మధ్య యుద్ధమూ అదే స్థాయిలో పెరిగింది. ఒకరిని తలపడేలా ఒకరు వినియోగదారుల ముందుకొస్తున్నారు. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్‌ అందిస్తూ కస్టమర్స్‌ను ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఈ పోరులో అనేక సంస్థలు తలపడుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థగా పేరొందున యాపిల్‌నూ భయపెడుతున్నాయి. దీంతో ఎట్టకేలకూ యాపిల్ సంస్థ మనసు మార్చుకుంది. ఐఫోన్‌ల ధరలను తగ్గించే ఆలోచన చేస్తోంది. 
 
iphone prices down

విక్రయాలు పడిపోయాయి…

 స్మార్ట్ ఫోన్‌ జీవితంలో భాగమైపోయింది. ఫోన్‌ లేకుండా రోజు గడవటమూ కష్టంగా మారిపోయింది. ఈ అవకాశాన్నే సెల్‌ఫోన్‌ సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. ఈ పోరులో యాపిల్ సంస్థ వెనకబడుతోంది. కొంతకాలంగా భారత్‌లో ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది ఏకంగా 15 శాతం విక్రయాలు తగ్గిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని సంస్థ కూడా సీరియస్‌గా తీసుకుని విక్రయాలు పెంచే ఆలోచన చేస్తోంది. డాలర్‌ విలువ క్రమక్రమంగా బలపడటంతో ఇండియా వంటి దేశాల్లో ఐఫోన్‌ ధర ఎక్కువగా పలుకుతుందని  యాపిల్‌ సీఈవో టీమ్‌ కుక్‌ అన్నాడు. వీటన్నింటినీ వెనక్కి నెట్టి ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ ధరలను భారీగా తగ్గించే ఆలోచన చేస్తున్నాడు. బ్యాటరీని ఉచితంగా రీప్లేస్‌ చేయడం వల్లనూ విక్రయాలు తగ్గిపోతున్నాయని అభిప్రాయపడ్డాడు. సేల్స్‌ పెరగడానికైనా ఇండియాలో భారీగా ధరలు తగ్గిస్తామన్నాడు. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *