ఏపీలో ఐదుగురు అధ్యక్షులకు తప్పని ఓటమి!

ఏపీలో ఐదుగురు అధ్యక్షులకు తప్పని ఓటమి!

హోరాహోరీ ప్రచారం చేశారు. విజయం తథ్యమనుకున్నారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆ నలుగురు నేతలు తమకు తిరుగులేదనుకున్నారు. కానీ ఆంధ్రా ఓటర్లు మాత్రం వారిని తిరస్కరించారు. అధ్యక్ష్యులుగా ఉన్న పార్టీలను ఓడించడంతో పాటు.. వారిని సైతం తిరస్కరించి ఇంటికి పంపారు. ఇంతకీ ఆ ఐదుగురు ప్రెసిడెంట్లు ఎవరు..? లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని అనుకున్నారు. ప్రచారం నుంచి ఓటింగ్‌ వరకు గెలుపుపై ధీమాతో ఉన్నారు. కానీ ఆయా పార్టీలు ఒకటి తలిస్తే ఆంధ్రా ఓటర్లు మరొరకంగా డిసైడయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన, టీడీపీ,ప్రజాశాంతి పార్టీలను ఘోరంగా ఓడించడంతో పాటు ఈ నాలుగు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న అధ్యక్షులను ఓడించి ఇంటికి పంపారు. పవన్‌ కల్యాణ్‌, కళా వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి,కేఏ పాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.

టీడీపీ-వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలో దిగిన జనసేనను ఓటర్లు తిరస్కరించారు. ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇటు భీమవరం.. అటు గాజువాకలో జనసేనాని ఓటమి చవిచూశారు.

ఏపీ విభజన సందర్భంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని తిరస్కరించిన ఓటర్లు.. ఐదేళ్ల తర్వాత కూడా ఆపార్టీని ఆదరించలేదు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులందరినీ ఓడించిన ఓటర్లు కల్యాణదురంగంలో ఆపార్టీ అధినేత రఘువీరారెడ్డిని కూడా వదిలిపెట్టలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో వెలుగు వెలిగిన రఘువీరారెడ్డి.. ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరమితమయ్యారు.

ఇక ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. అటు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ స్థానానికి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయారు. ఇలా నాలుగు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఓటమి చవిచూడటం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఏపీ ఎన్నికల్లో ఎన్నికల షెడ్యూల్ మొదలైన దగ్గరి నుంచి ఫన్‌‌ని కావాల్సిన అందించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.అన్ని పార్టీలను భూస్థాపితం చేసి… తాము అధికారంలోకి వస్తామని 150పైగా సీట్లు గెలుస్తున్నానని.. ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా చేస్తున్నాను.. నేనే సీఎం లాంటి అనూహ్యమైన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యారు కేఏ పాల్.కనీసం మెజారిటీ స్థాయి ఓట్లు కూడా సాధించలేకపోవడమంటే ప్రజల్లో కేఏ పాల్‌పై నమ్మకం కాకపోయినా కనీస గుర్తింపు కూడా లేకపోవడం విశేషం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *