ఫలితాల్లో వెనకబడ్డ ఏపీ మంత్రులు వీరే!

ఫలితాల్లో వెనకబడ్డ ఏపీ మంత్రులు వీరే!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే వైసీపీ అద్భుత మెజారిటీతో దూసుకుపోతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో అత్యధిక సీట్లను గెలిచి రికార్డు మెజారిటీని సాధించేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి వైకాపా 134 స్థానాల్లో, తెదేపా 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇక్కడ ఆసక్తి రేపుతున్న మరో అంశం…ఇప్పటివరకూ ఆంధ్రప్రడేశ్‌కు మంత్రులుగా పనిచేసిన వారు ఈ ఫలితాల్లో వెనుకంజలో ఉండటం.

మంత్రులుగా పనిచేసిన నారా లోకేశ్‌, అఖిలప్రియ, నారాయణ, అయ్యన్నపాత్రుడు, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు వెనుకంజలో ఉన్నారు.

కృష్ణా జిల్లా మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, చిలకలూరిపేట నుంచి ప్రత్తపాటి పుల్లారావు, తిరువూరు నుంచి జవహర్‌ ముందంజలో ఉన్నారు.ఎంపీ స్థానాల్లోనూ వైకాపా అధిక్యంలో ఉంది. వైకాపా 20 స్థానాల్లో, తెదేపా 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *