శ్రీలంక అమ్మాయి,ఆంధ్ర అబ్బాయి ప్రేమ పెళ్లి

శ్రీలంక అమ్మాయి,ఆంధ్ర అబ్బాయి ప్రేమ పెళ్లి

ప్రేమ ఎవరినైనా కలుపుతుందనడాని ఈ సంఘటనే ఓ ఉదాహరణ. పశ్చిమగోదావరి జిల్లా కోయిలగూడెంకు చెందిన ఉమా మహేష్‌ అనే యువకుడు..శ్రీలంకకు చెందిన రువీని హేమాలిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొవ్వూరు సత్యనారాయణ స్వామి గుడిలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వరుడు ఉమా మహేష్‌ మస్కట్‌లోని ఓ హోటల్‌లో పని చేస్తూ ఉండగా.. శ్రీలంకకు చెందిన రూవిని హేమలీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో..వరుడు తల్లిదండ్రులను ఒప్పించి ఈరోజు వివాహం చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికికి వధువు తరుపున బంధువులు పాల్గొన్నారు. ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఈ కార్యక్రమంలో పాల్గొని దంపతుల ను ఆశీర్వదించి అభినందించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *